Rajinikanth: ‘ముత్తు’ రీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. థిల్లాన థిల్లాన దుమ్మురేపుతుందా..

ABN , First Publish Date - 2023-11-18T20:23:19+05:30 IST

ఇప్పుడంతా 4K రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది. అప్పట్లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను హీరోల పుట్టిన రోజులకు, సినిమా యానివర్సరీలకు అభిమానులు రీ రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘ముత్తు’ చిత్రాన్ని డిసెంబర్ 2న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Rajinikanth: ‘ముత్తు’ రీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. థిల్లాన థిల్లాన దుమ్మురేపుతుందా..
Muthu Movie Poster

ఇప్పుడంతా 4K రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది. అప్పట్లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను హీరోల పుట్టిన రోజులకు, సినిమా యానివర్సరీలకు అభిమానులు రీ రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా రీ రిలీజ్ అయిన సినిమాలు భారీగా కలెక్షన్స్ సాధించడంతో ఇప్పుడంతా ఇదొక కల్చర్‌లా మారిపోయింది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) నటించిన ‘ముత్తు’ (Muthu) సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు ఆయన అభిమానులు. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘ముత్తు’ చిత్రాన్ని డిసెంబర్ 2న గ్రాండ్‌గా రీ రిలీజ్ (Muthu Re Release Date) చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక నాలుగు ప్రాంతాల్లోని వేలాది థియేటర్లలో బ్రహ్మాండంగా ఈ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమైంది.

తలైవా రజనీకాంత్ కెరియర్‌లో సూపర్ హిట్ చిత్రాలలో ‘ముత్తు’ మొదటి వరుసలో ఉంటుంది. కె. ఎస్. రవికుమార్ (KS Ravi Kumar) దర్శకత్వంలో 1995లో విడుదలైన ఈ సినిమాలో రజనీకాంత్ సరసన మీనా (Meena) హీరోయిన్‌గా నటించింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో అద్భుతమైన పాటలు నేటికి శ్రోతలను, తలైవా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 23 అక్టోబరు, 1995న విడుదలైన ఈ చిత్రం ఆనాడు సూపర్ హిట్ చిత్రంగా నిలవడమే కాకుండా.. బాక్సాఫీస్‌ను కలెక్షన్లతో షేక్ చేసింది.


Meena.jpg

తమిళనాడు (Tamil Nadu)లోని చాలా థియేటర్లలో 175 రోజులు ప్రదర్శించబడి అందరినీ ఆశ్చర్యంలో ముచ్చెత్తింది. సౌత్‌లో సంచలనం సృష్టించిన ‘ముత్తు’ సినిమా 1998లో జపనీస్ భాషలో విడుదలై సంచలన విజయం అందుకోవడమే కాకుండా.. దాదాపు 400 మిలియన్ యాన్లను రాబట్టింది. దాంతో రజనీకాంత్ జపాన్‌లో కూడా వీరాభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 2న రీ రిలీజ్ అవుతుండంతో ఆయన అభిమానులు పండుగ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలోని ‘థిల్లాన థిల్లాన’ పాటకు స్టెప్స్ దుమ్మురేపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల ‘జైలర్’ (Jailer)తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన రజనీ.. ఈ రీ రిలీజ్‌తోనూ మరోసారి తన స్థామినా చూపిస్తాడని అంతా భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Siren Teaser: మంచోడు.. మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా?

********************************

*Unstoppable with NBK: ‘వైల్డెస్ట్ ఎపిసోడ్ ప్రోమో’.. బాలయ్యను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ హీరో..!

********************************

Updated Date - 2023-11-18T20:23:21+05:30 IST