Miriam Maa: 50 ఏళ్లు పైబడిన ఒక మహిళ కృత్రిమ గర్భధారణను ఎంచుకుంటే..

ABN , First Publish Date - 2023-07-01T19:49:45+05:30 IST

సీనియర్‌ నటి రేఖ సుధీర్ఘకాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రం ‘మిరియమ్మ’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. డెబ్యూ డైరెక్టర్‌ మాలతీ నారాయణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రేఖతో పాటు ఎళిల్‌ దురై, స్నేహా కుమార్‌, అనితా సంపత్‌, విజే ఆషిక్‌, మాలతి నారాయణన్‌ తదితరులు నటించారు.

Miriam Maa: 50 ఏళ్లు పైబడిన ఒక మహిళ కృత్రిమ గర్భధారణను ఎంచుకుంటే..
Miriam Maa Movie First Look

సీనియర్‌ నటి రేఖ (Rekha) సుధీర్ఘకాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రం ‘మిరియమ్మ’ (Miriam Maa). తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. డెబ్యూ డైరెక్టర్‌ మాలతీ నారాయణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రేఖతో పాటు ఎళిల్‌ దురై, స్నేహా కుమార్‌, అనితా సంపత్‌, విజే ఆషిక్‌, మాలతి నారాయణన్‌ తదితరులు నటించారు. జేసన్‌ విలియమ్సన్‌ ఛాయాగ్రహణం అందించగా, ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో నటి రేఖ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలో నటిస్తున్నారు. పైగా ఆమె సుధీర్ఘకాలం తర్వాత మళ్ళీ నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ప్రేక్షకుల్లో ఒక్కసారిగా పెరిగిపోయాయి. (Miriam Maa Movie First Look)

ఇక చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా.. మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమా గురించి దర్శకురాలు మాట్లాడుతూ... ‘‘ప్రతి ఒక్క ఆడబిడ్డ జన్మించి, పుష్పవతి అయిన తర్వాత వివాహం చేసుకుని తల్లి కావాలని కోరుకుంటారు. అయితే, ఇక్కడ 50 ఏళ్లు పైబడిన ఒక మహిళ గర్భవతి కావాలని పరితపిస్తుంది. ఇందుకోసం కృత్రిమ గర్భధారణను ఎంచుకుంటుంది. ఈ విధానంలో పిల్లలకు జన్మనివ్వాలనుకునే మహిళలు పడే సాధక బాధలు సవాళ్ళే ఈ చిత్ర కథాంశం’’ అని వివరించారు.

Miriam-Maa-First-Look.jpg

ఇక తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో రేఖ (Rekha) సీమంతానికి సంబంధించి గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరుపుతున్నట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు. రేఖతో పాటు మరికొందరు నటులు ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్ కలర్‌పుల్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

**************************************

*VV Vinayak: డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల్లో ‘సాక్షి’

**************************************

*TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. దానికి సమాధానమిదే!

**************************************

*D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం

**************************************

*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!

**************************************

Updated Date - 2023-07-01T19:49:45+05:30 IST