కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahima Nambiar: క్యాస్టింగ్ కౌచ్‌పై ఏమందంటే..

ABN, First Publish Date - 2023-09-18T15:38:25+05:30

చిత్ర పరిశ్రమలో తనకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని హీరోయిన్‌ మహిమా నంబియార్‌ తెలిపారు. ‘సాట్టై’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మహిమా.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన ‘800’, ‘చంద్రముఖి-2’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Mahima Nambiar

చిత్ర పరిశ్రమలో తనకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని హీరోయిన్‌ మహిమా నంబియార్‌ (Mahima Nambiar) తెలిపారు. ‘సాట్టై’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మహిమా.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన ‘800’, ‘చంద్రముఖి-2’ (Chandramukhi 2) చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ..

‘‘చంద్రముఖి-2 చిత్రంలో రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) సరసన నటించా. ఇందులో పలువురు సీనియర్‌ కళాకారులతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. క్రికెట్‌ లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘800’లో హీరో భార్యగా నటించా. మురళీధరన్‌ క్రికెటర్‌గా మాత్రమే మనకు తెలుసు. కానీ, ఆయన ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న కష్టాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఈ చిత్రంలో చూస్తారు. ఈ మూవీ వచ్చే నెలలో విడుదలకానుంది.


ఇకపోతే, ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ ఉందా? అనే ప్రశ్న చాలా చోట్ల ఎదురవుతుంది. ఇతరులు వెల్లడించిన క్యాస్టింగ్‌ కౌచ్‌ (Casting Couch) వంటి అంశాలపై నేను స్పందించను. నా వరకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు. నా పట్ల ఎవరూ అలా ప్రవర్తించలేదు. నా వరకు వచ్చిన మంచి అవకాశాలను చూజ్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను..’’ అని మహిమా నంబియార్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Anand Deverakonda: నేనే ఈ టీమ్‌లో కాస్త ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడిని..

************************************

*Keedaa Cola: ఎట్టకేలకు ‘కీడా కోలా’కు మోక్షం లభించబోతోంది..

**********************************

Updated Date - 2023-09-18T15:40:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!