Udhayanidhi Stalin: నా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రమిది

ABN , First Publish Date - 2023-07-10T21:50:46+05:30 IST

ఇప్పటివరకు తాను నటించిన చిత్రాల్లోనే అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రం ‘మామన్నన్‌’ అని ఆ చిత్ర హీరో, నిర్మాత ఉదయనిధి తెలిపారు. ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తంగా రూ.52 కోట్ల మేరకు గ్రాస్‌ వసూళ్లు సాధించినట్టు ప్రకటించారు. మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఉదయనిధి - కీర్తి సురేష్‌ జంటగా నటించగా.. హాస్య నటుడు వడివేలు ప్రధాన పాత్రను పోషించారు.

Udhayanidhi Stalin: నా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రమిది
Maamannan Movie Success Meet

ఇప్పటివరకు తాను నటించిన చిత్రాల్లోనే అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రం ‘మామన్నన్‌’ (Maamannan) అని ఆ చిత్ర హీరో, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తెలిపారు. ఇప్పటివరకు మొత్తం రూ.52 కోట్ల మేరకు గ్రాస్‌ వసూళ్లు సాధించినట్టు ప్రకటించారు. మారి సెల్వరాజ్‌ (Mari Selvaraj) దర్శకత్వంలో ఉదయనిధి - కీర్తి సురేష్‌ (Keerthi Suresh) జంటగా, హాస్య నటుడు వడివేలు (Vadivelu) ప్రధాన పాత్రను పోషించిన ‘మామన్నన్‌’ చిత్రం గత నెల 29న విడుదలైంది. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందించారు. ఈ మూవీ సాధించిన కలెక్షన్స్‌తో హ్యాపీగా ఉన్న చిత్రయూనిట్.. తాజాగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో హీరో ఉదయనిధి మాట్లాడుతూ... తమిళనాడు, కేరళ, ఓవర్సీస్‌తో కలుపుకుని మొత్తం రూ.52 కోట్ల గ్రాస్‌ వసూళ్లను ‘మామన్నన్’ రాబట్టింది. నా కెరీర్‌లో ఈ వసూళ్ళే అత్యధికం. త్వరలోనే తెలుగులో ‘నాయకుడు’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నాం. అక్కడ కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. మారి సెల్వరాజ్‌ అసిస్టెంట్స్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. (Maamannan Movie Success Meet)

హాస్యనటుడు వడివేలు మాట్లాడుతూ.. నేను నవ్వకుండా నటించిన ఏకైక చిత్రం ‘మామన్నన్‌’. ఈ చిత్రానికి నిజమైన మామన్నన్‌ మారి సెల్వరాజ్‌. ఇలాంటి స్టోరీలో నటించేందుకు ముందుకు వచ్చిన ఉదయనిధికి హ్యాట్సాఫ్‌. సినిమా ఆదరించి బ్రహ్మాండమైన సక్సెస్ చేసిన ప్రేక్షకులు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఇంకా హీరోయిన్‌ కీర్తి సురేష్‌, దర్శకుడు మారి సెల్వరాజ్‌ తదితరులు ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Viraj Ashwin: ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందంటోన్న యంగ్ హీరో

**************************************

*Brahmaji: మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్.. తర్వాత మనం కష్టపడాల్సిందే..

**************************************

*Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?

**************************************

*Deen Raj: ఎన్నో క‌ష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం

**************************************

*Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..

**************************************

Updated Date - 2023-07-10T21:50:46+05:30 IST