Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?

ABN , First Publish Date - 2023-07-08T22:36:41+05:30 IST

వెండితెర అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ తమిళ వెండితెరకు పరిచయం కానున్నట్లుగా తెలుస్తోంది. ‘లవ్‌ టుడే’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, హీరోగా నటించిన ప్రదీప్‌ రంగనాథన్‌ సరసన ఆమె నటించనున్నారు. ఈ సినిమాకు విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?
Janhvi Kapoor

వెండితెర అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తమిళ వెండితెరకు పరిచయం కానున్నట్లుగా తెలుస్తోంది. ‘లవ్‌ టుడే’ (Love Today) వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, హీరోగా నటించిన ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) సరసన ఆమె నటించనున్నారు. ఈ సినిమాకు విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘విక్రమ్‌’ ఘన విజయం తర్వాత కమల్‌హాసన్‌ ఒక వైపు హీరోగాను, మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు. ఆయన మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే, హీరోలు శింబు, శివకార్తికేయన్‌ వంటి వారితో సొంతంగా నిర్మిస్తున్నారు.


తాజాగా ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా ఒక ప్రాజెక్టుకు ప్లాన్‌ చేయగా, ఇందులో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా నటింపజేసి, కోలీవుడ్‌కు పరిచయం చేయించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ పరిశ్రమలోకి (Kollywood) కూడా అడుగుపెట్టాలని ఆమె తహతహలాడుతున్నారు (Janhvi Kapoor Kollywood Entry). ఇదిలా ఉండగా ఈ చిత్రంలో అగ్రనటి నయనతార (Nayanthara) ఓ కీలక పాత్రను పోషించనున్నారని తెలుస్తోంది.

Pradeep.jpg

జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ (Devara)తో టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది. సౌత్ ఎంట్రీ అలా ఇస్తున్న జాన్వీ.. ఇప్పుడు సౌత్‌లోని అన్ని భాషలపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. అందుకే కమల్ హాసన్ నిర్మిస్తోన్న చిత్రం కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. మలయాళం, కన్నడలోనూ త్వరలోనే ఆమె ఎంట్రీ ఉండనుందనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

**************************************

*Deen Raj: ఎన్నో క‌ష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం

**************************************

*Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..

**************************************

*Rangabali: సక్సెస్ మీట్‌లో జర్నలిస్ట్ అడిగిందేంటి?.. దానికి నాగశౌర్య అంత ఫీలయ్యాడేంటి?

**************************************

*BroTheAvatar: మై డియర్ మార్కండేయ.. మనల్ని ఆపే మగాడెవడు ‘బ్రో’..!

**************************************

*Nayakudu: ‘నాయకుడు’కి రాజమౌళి, మహేష్ బాబు సపోర్ట్

**************************************

Updated Date - 2023-07-08T22:36:41+05:30 IST