Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..

ABN , First Publish Date - 2023-07-08T21:39:12+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘నా రోజా నువ్వే’ పాట సెన్సేషన్‌ని క్రియేట్ చేయగా.. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఆరాధ్య’ అంటూ సాగే ఈ సెకండ్ సింగిల్ ప్రోమోను సోమవారం, పూర్తి పాటను బుధవారం (జూలై 12) విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటిస్తూ.. ఓ క్యూట్ పోస్టర్‌ని విడుదల చేశారు.

Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..
Vijay Deverakonda and Samantha In Kushi

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ (Kushi). సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తున్నానని ప్రకటించింది కాబట్టి.. విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎంతో కీలకం. ‘లైగర్’ తర్వాత విజయ్ చేస్తున్న చిత్రమిది. ‘లైగర్’ (Liger)తో పోయిన పరువును నిలబెట్టే చిత్రంగా ‘ఖుషి’ని విజయ్ భావిస్తున్నారు. ఆ రేంజ్‌కి తగ్గట్లే.. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘నా రోజా నువ్వే’ (Naa Roja Nuvve) సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికీ ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. లవ్ స్టోరీస్‌, ఎమోషనల్ స్టోరీస్‌ని తీయడంలో శివ నిర్వాణ (Shiva Nirvana) మార్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోసారి శివ నిర్వాణ తన మ్యాజిక్ చూపించేందుకు ఈ సినిమాతో రెడీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్‌ని మేకర్స్ విడుదల చేశారు.


‘ఖుషి’ చిత్రం నుంచి ఆరాధ్య అనే సాంగ్‌ను విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత, విజయ్‌లు ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ‘ఆరాధ్య’ (Aradhya) అంటూ సాగే ఈ పాట ప్రోమోను సోమవారం, పూర్తి పాటను బుధవారం (జూలై 12) విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ పాట అప్‌డేట్ ఏమోగానీ.. విడుదల చేసిన పోస్టర్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో సమంత, విజయ్‌ల కెమిస్ట్రీ అదిరిపోయిందనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. (Kushi Second Single Update)

Kushi.jpg

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ‘నా రోజా నువ్వే’ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఈ పాట ఇప్పుడు వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ ‘ఆరాధ్య’తో మరోసారి ‘ఖుషి’ సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరుతుందని మేకర్స్ తెలుపుతున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Rangabali: సక్సెస్ మీట్‌లో జర్నలిస్ట్ అడిగిందేంటి?.. దానికి నాగశౌర్య అంత ఫీలయ్యాడేంటి?

**************************************

*BroTheAvatar: మై డియర్ మార్కండేయ.. మనల్ని ఆపే మగాడెవడు ‘బ్రో’..!

**************************************

*Nayakudu: ‘నాయకుడు’కి రాజమౌళి, మహేష్ బాబు సపోర్ట్

**************************************

*Ticket Prices Hike: సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై రచ్చ రచ్చ

**************************************

*Bedurulanka 2012: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి మరో సినిమా..

**************************************

Updated Date - 2023-07-08T21:39:12+05:30 IST