Vijay Sethupathi: ఆ సినిమా నుంచి తప్పుకొన్నాడా..?

ABN , First Publish Date - 2023-02-23T18:38:38+05:30 IST

విభిన్న సినిమాలు, వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ‘విక్రమ్ వేద’, ‘సూపర్ డీలక్స్’, ‘ఉప్పెన’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయనను అభిమానులందరు ముద్దుగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుస్తుంటారు.

Vijay Sethupathi: ఆ సినిమా నుంచి తప్పుకొన్నాడా..?

విభిన్న సినిమాలు, వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ‘విక్రమ్ వేద’, ‘సూపర్ డీలక్స్’, ‘ఉప్పెన’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయనను అభిమానులందరు ముద్దుగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుస్తుంటారు. తాజాగా విజయ్ సేతుపతికి సంబంధించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో షికార్లు కొడుతుంది. అదేంటంటే..

బాక్సాఫీస్ సంచలన విజయం సాధించిన ప్రాంచైజీ ‘అరణ్మనై’ (Aranmanai). సుందర్ సి (Sundar C ) దర్శకత్వం వహించారు. ఈ ప్రాంచైజీలో మూడు చిత్రాలు ఇప్పటి వరకు విడుదల అయ్యాయి. ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అతి త్వరలోనే ‘అరణ్మనై-4’ (Aranmanai-4) పట్టాలెక్కునుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకొన్నట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి. ‘అరణ్మనై’ తొలి భాగం 2014లో విడుదల అయింది. ఇందులో హన్సిక, రాయ్‌లక్ష్మి, వినయ్‌ తదితరులు నటించారు. ఆ తర్వాత 2016లో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021లో మూడో భాగం రాగా ఇందులో ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ‘అరణ్మనై-4’ ను దర్శకుడు ప్లాన్‌ చేశారు. ఇందులో విజయ్‌ సేతుపతి నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ, అనివార్య కారణాలతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. సుందర్‌ సి ప్రస్తుతం ‘తలైనగరం-2’ను రూపొందిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ‘ఫర్జీ’ (Farzi) వెబ్‌సిరీస్‌లో నటించారు. మైఖేల్ పాత్రలో కనిపించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో అభిమానుల మెప్పుతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. షారూఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ (Jawan) లోను విలన్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-23T18:38:39+05:30 IST