Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

ABN , First Publish Date - 2023-02-23T13:35:00+05:30 IST

బాలీవుడ్‌లో‌ని స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. ‘రాక్ స్టార్’, ‘యే జవానీ హై దివానీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. చివరగా ‘బ్రహ్మాస్త్ర: ది పార్ట్ 1’ లో నటించారు.

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

బాలీవుడ్‌లో‌ని స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. ‘రాక్ స్టార్’, ‘యే జవానీ హై దివానీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. చివరగా ‘బ్రహ్మాస్త్ర: ది పార్ట్ 1’ లో నటించారు. ఈ సినిమాలోని నటనకు గాను ఉత్తమ నటుడి కేటగిరిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పురస్కారాన్ని అందుకునే అర్హత తనకు లేదని తెలిపారు.

రణ్‌బీర్ కపూర్ తాజాగా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (TuJhoothi Main Makkaar)లో నటించారు. ఈ సినిమా హోలి కానుకగా మార్చి 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఆసక్తికర సంగతులను ప్రేక్షకులతో పంచుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కైవసం చేసుకోవడంపై స్పందించారు. ‘‘ఈ అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉంది. కానీ, ఈ పురస్కారాన్ని అందుకునే అర్హత నాకు లేదు. నేను ‘బ్రహ్మాస్త్ర’ లో అద్భుతంగా ఏమీ నటించలేదు. కొంత మంది 2022లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ‘పుష్ప’ (Pushpa) లో అల్లు అర్జున్ (Allu Arjun), ‘గంగూబాయి కతియవాడి’ లో ఆలియా భట్ (Alia Bhatt), ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు నన్ను ఎంతగానో ప్రభావితం చేశారు’’ అని రణ్‌బీర్ చెప్పారు. ‘బ్రహ్మాస్త్ర: ది పార్ట్ 1’ భారీ బడ్జెట్‌తో రూపొందింది. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాగార్జున, మౌనీరాయ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం డిసెంబర్ 2025లో విడుదల కానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-23T13:38:55+05:30 IST