Mohanlal: స్టార్ హీరో దర్శకత్వంలో నటించనున్న మలయాళం సూపర్ స్టార్..!

ABN , First Publish Date - 2023-02-25T18:26:03+05:30 IST

సౌతిండియాలోని సూపర్ స్టార్స్‌లో మోహన్ లాల్ (Mohanlal) ఒకరు. కొత్త రకం చిత్రాలు, వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. చివరగా ‘ఎలోన్’ (Alone) లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Mohanlal: స్టార్ హీరో దర్శకత్వంలో నటించనున్న మలయాళం సూపర్ స్టార్..!

సౌతిండియాలోని సూపర్ స్టార్స్‌లో మోహన్ లాల్ (Mohanlal) ఒకరు. కొత్త రకం చిత్రాలు, వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. చివరగా ‘ఎలోన్’ (Alone) లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మోహన్ లాల్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ మీడియాలో విపరీతంగా షికార్లు కొడుతుంది. అదేంటంటే..

Arjun.jpg

యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) దర్శకత్వంలో మోహన్ లాల్ నటించనున్నట్టు తెలుస్తోంది. అర్జున్ ప్రస్తుతం లాల్‌కు స్క్రిఫ్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం. కానీ, ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు. ప్రస్తుతం మోహన్ లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలన్ని పూర్తయిన తర్వాతే అర్జున్ దర్శకత్వంలో నటించనున్నారు. అయితే, ‘మార్టిన్’ (Martin) టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అర్జున్ తాజాగా పాల్గొన్నారు. లాల్‌తో పనిచేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టు గురించి మోహన్ లాల్‌తో చర్చించినట్టు పేర్కొన్నారు.

అర్జున్, మోహన్ లాల్ కలసి గతంలో ‘అరేబియా: సముద్ర సింహం’ లో నటించారు. అర్జున్ ఈ పాన్ ఇండియా సినిమాలో ఆనందన్ అనే యోధుడి పాత్రను పోషించారు. ఆయన టాలీవుడ్‌లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. తన కూతురు ఐశ్వర్య అర్జున్‌ను తెలుగులో లాంచ్ చేయాలని భావించారు. విష్వక్‌సేన్ హీరోగా నటిస్తాడని చిత్రాన్ని కూడా ప్రకటించారు. అయితే, ఈ మూవీ నుంచి విష్వక్ తప్పుకోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Simbu: ఎట్టకేలకు శింబు పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-25T18:26:04+05:30 IST