Kaathal The Core: రెండు దేశాల్లో మమ్ముట్టి, జ్యోతికల చిత్రం బ్యాన్.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-11-22T12:32:16+05:30 IST

మమ్ముట్టి- జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాథల్-ది కోర్‌’ (Kaathal - The Core). మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాపై రెండు దేశాలలో నిషేధం విధించారు. జియో బేబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కువైట్‌, ఖతార్‌ దేశాలు బ్యాన్‌ చేశాయి. దీంతో ఈ సినిమాపై వార్తలు వైరల్ అవుతున్నాయి.

Kaathal The Core: రెండు దేశాల్లో మమ్ముట్టి, జ్యోతికల చిత్రం బ్యాన్.. ఎందుకంటే?
Mammootty and Jyothika

మమ్ముట్టి (Mammootty)- జ్యోతిక (Jyothika) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాథల్-ది కోర్‌’ (Kaathal - The Core). మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాపై రెండు దేశాలలో నిషేధం విధించారు. జీయో బేబి (Jeo Baby) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కువైట్‌, ఖతార్‌ దేశాలు (Qatar and Kuwait) బ్యాన్‌ చేశాయి. దీంతో ఈ సినిమాపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఈ సినిమాను ఆ దేశాలు బ్యాన్ చేశాయి అనేలా వైరల్ అవుతున్న వార్తలతో ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తోంది. ఎందుకు ఈ సినిమాని ఆ దేశాలు బ్యాన్ చేశాయంటే.. కారణం ఈ చిత్ర కథే. ఈ సినిమా స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా తెరకెక్కిందని, అందుకే ఆ దేశాలు బ్యాన్ చేశాయనేలా టాక్ వినబడుతోంది.

రీసెంట్‌గా ఈ చిత్ర కథా నేపథ్యాన్ని ఓ పత్రిక రివీల్ చేసింది. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన మాథ్యూ (మమ్ముట్టి).. ఆ తర్వాత ఆ గ్రామంలో జరిగే పంచాయతీ ఎన్నికలకు పోటీ చేయాలని నిర్ణయించుకుని నామినేషన్‌ వేస్తాడు. నామినేషన్ వేసిన రెండు రోజులకు అతని భార్య ఓమన (జ్యోతిక) అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుని విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. అదే గ్రామంలో డ్రైవింగ్‌ స్కూల్ నడుపుతోన్న ఓ వ్యక్తితో మాథ్యూ గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. మాథ్యూ లైంగిక ధోరణిని తాను నేరంగా చూడడం లేదని.. కేవలం విడాకులు మాత్రమే కోరుతున్నట్లు చెబుతుంది. దీంతో అతడి పోటీపై సందిగ్ధత నెలకొంటుంది. అయితే, మాథ్యూ మాత్రం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మాథ్యూ ఎన్నికల్లో పోటీ చేశాడా? లేదా? మాథ్యూ, ఓమనలకు విడాకులు వచ్చాయా? లేదా అనేదే ‘కాథల్-ది కోర్‌’ కథ.


Jyothika-2.jpg

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో కూడా హాట్ హాట్‌గా చర్చలు నడిచిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ఆసక్తికరమైన కథాంశంగా మలిచి దర్శకుడు ఇందులో చూపించినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ఇది స్వలింగ సంపర్కుల నేపథ్యం అని తెలిసిందో.. వెంటనే కువైట్‌, ఖతర్ దేశాలు ఈ సినిమాను తమ దేశంలో ప్రదర్శించడానికి వీల్లేదంటూ బ్యాన్ విధించాయి. ఈ రెండు దేశాలే కాదు.. మరికొన్ని అరబ్‌ దేశాలు కూడా ఇదే డెసిషన్ తీసుకోనున్నాయనేలా టాక్ వినిపిస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో చిత్రయూనిట్ బిజీబిజీగా ఉంది. మమ్ముట్టి, జ్యోతిక, దర్శకుడు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాకు సంబంధించిన విషయాలను, విశేషాలను తెలియజేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: మా ఆవిడ చెప్పే వరకు తెలియదు.. మా 16 నెలల అబ్బాయికి ఆ పాట పెట్టాల్సిందే

*****************************

*Pro Kabaddi: క్రికెట్ హంగామా ముగిసింది.. ఇప్పుడిదే సీజన్.. బాలయ్య తొడగొట్టేశాడు

*****************************

*Allu Aravind: వ్యక్తుల్ని కాదు.. వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ఇది

*********************************

Updated Date - 2023-11-22T12:32:17+05:30 IST