Dil Raju: మా ఆవిడ చెప్పే వరకు తెలియదు.. మా 16 నెలల అబ్బాయికి ఆ పాట పెట్టాల్సిందే

ABN , First Publish Date - 2023-11-21T16:45:00+05:30 IST

మా ఆవిడ చెప్పే వరకు ‘కోట బొమ్మాళి పీఎస్‌’లోని ‘లింగిడి లింగిడి’ సాంగ్ వైరల్ అవుతున్న విషయం నాకు తెలియదని అన్నారు సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు. యంగ్ హీరో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని (Teja Marni) తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు హాజరయ్యారు.

Dil Raju: మా ఆవిడ చెప్పే వరకు తెలియదు.. మా 16 నెలల అబ్బాయికి ఆ పాట పెట్టాల్సిందే
Producer Dil Raju

మా ఆవిడ చెప్పే వరకు ‘కోట బొమ్మాళి పీఎస్‌’ (Kota Bommali PS)‌లోని ‘లింగిడి లింగిడి’ సాంగ్ వైరల్ అవుతున్న విషయం నాకు తెలియదని అన్నారు సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు. యంగ్ హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) లీడ్‌ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని (Teja Marni) తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోన్న సందర్భంగా సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ‘కోట బొమ్మాళి పీఎస్ ప్రచార సభ‌’ (Kota Bommali PS Prachara Sabha) పేరుతో మేకర్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిర్మాత దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. ‘కోట బొమ్మాళి పీఎస్‌’ సినిమా నా కారణంగా కూడా కాస్త ఆలస్యమైంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. ఈ సినిమాకు శ్రీకాంత్‌గారి షెడ్యూల్ ఉన్నప్పుడు ఆయనని ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా షూటింగ్‌కి తీసుకెళ్లాను. దీనితో రెండు షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. ఈ విషయంలో బన్నీ వాసు నాకు ఎంతో హెల్ప్ చేశారు. ‘కోట బొమ్మాళి పీఎస్‌’.. ఒక మంచి కాన్సెప్ట్‌తో తయారు చేసుకున్న కమర్షియల్ ఫిల్మ్. ఈ సినిమా మాములుగా వస్తే ఎలా ఉండేదో తెలియదు కానీ.. వైరల్ అవుతున్న ‘లింగిడి లింగిడి’ సాంగ్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి.


Allu.jpg

మా అబ్బాయికి ఇప్పుడు 16 నెలలు. వాడికి రోజు రెండు సార్లు అయినా ఈ పాట పెట్టాల్సిందే. (నవ్వుతూ..) మా ఆవిడ చెప్పే వరకు ఈ సాంగ్ గురించి నాకు తెలియదు. తను చెప్పిన తర్వాత కంటిన్యూస్‌గా సాంగ్ వినిపిస్తూనే ఉంది. ఆ సాంగ్‌తో ఈ మూవీకి హైప్ క్రియేట్ అయింది. చిత్రయూనిట్ అనుకున్నది ఆడియన్స్‌కి రీచ్ అయింది. నవంబర్ 24న ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా ఎగ్జయిట్‌మెంట్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసుకి సెంటిమెంట్.. నేను ఈవెంట్‌కి రావడం. నేను వస్తాను.. వాసు హిట్‌లు కొడుతూనే ఉంటాడు. ఆల్ ద బెస్ట్ టు టీమ్ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Pro Kabaddi: క్రికెట్ హంగామా ముగిసింది.. ఇప్పుడిదే సీజన్.. బాలయ్య తొడగొట్టేశాడు

*****************************

*Allu Aravind: వ్యక్తుల్ని కాదు.. వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ఇది

*********************************

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లిలో సినీ ప్రముఖుల సందడి

*****************************

Updated Date - 2023-11-21T16:45:02+05:30 IST