Allu Aravind: వ్యక్తుల్ని కాదు.. వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ఇది

ABN , First Publish Date - 2023-11-21T14:24:56+05:30 IST

ఏ వ్యక్తుల్ని ఉద్దేశించి కాదు.. ఓ వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్‌’ అని అన్నారు ‘ఏస్ ప్రొడ్యూసర్’ అల్లు అరవింద్. యంగ్ హీరో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

Allu Aravind: వ్యక్తుల్ని కాదు.. వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ఇది

ఏ వ్యక్తుల్ని ఉద్దేశించి కాదు.. ఓ వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్‌’ (Kota Bommali PS) అని అన్నారు ‘ఏస్ ప్రొడ్యూసర్’ అల్లు అరవింద్ (Allu Aravind). యంగ్ హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) లీడ్‌ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని (Teja Marni) తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ‘కోట బొమ్మాళి పీఎస్ ప్రచార సభ‌’ (Kota Bommali PS Prachara Sabha) పేరుతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ (Allu Aravind Speech).. ‘‘ఈ సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఎవరూ చెప్పని ఒక చిన్న కథ చెబుదామనే.. అంటే పోలీసులు క్రిమినల్స్‌ని, క్రిమినల్స్ వాళ్లకి లొంగేవారిని లొంగదీసుకోవడం కామనే. ఈ కథలో ప్రత్యేకం ఏమిటంటే.. ‘పోలీస్ చేజేస్ పోలీస్’. పోలీసులని పోలీసులు పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథ. ఈ సినిమాలో ఎవరూ హీరోలు లేరు. కథే హీరోగా వెళుతుంటుంది. తప్పకుండా ఈ వెరైటీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇందులో నటించిన శ్రీకాంత్ (Srikanth) నాకు ఆత్మీయుడు. మా బ్యానర్‌లో ‘పెళ్లిసందడి’తో మొదలయ్యాడు. అప్పటి నుంచి ఎక్కడ అవకాశం ఉన్నా మా సినిమాల్లో నటిస్తుంటాడు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. హీరో రాహుల్ వాళ్ల నాన్న మా బ్యానర్‌లో ఫైట్ మాస్టర్‌గా చేశాడు. వాళ్లబ్బాయి హీరోగా చేస్తున్నాడు.


Allu.jpg

పోలీసుల్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు? అనేది చెప్పడం కోసం కోటబొమ్మాళి అనేది తీసుకున్నాం. ఇది ఏ రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆఫీసర్‌ని ఉద్దేశించి మేము తీయలేదు. ఆల్ ఇండియాలో ఉన్న ఓ వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ఇది. పోలీసులను న్యాయం చేయనీయరు అనేది చెప్పడం జరిగింది తప్పితే.. ఎవరినీ ఉద్దేశించింది మాత్రం కాదు. ఈ మెసేజ్‌ని ఈ ఎలక్షన్ల టైమ్‌లో తీసుకెళ్లే సందర్భం మాకు కుదిరింది. కథ ఎన్నుకునే సమయంలోనూ, అలాగే ఎడిటింగ్ రూమ్‌లో మాత్రమే నేను.. మిగతా అంతా బన్నీవాసు, విద్య, భాను, రియాజ్‌లే చూసుకున్నారు. ఇంకా ఎంతో మంది నూతన నిర్మాతలను మా సంస్థ నుంచి తీసుకురావాలని భావిస్తున్నాను. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ అని చెప్పుకొచ్చారు. (Kota Bommali PS Pre Release Event)


ఇవి కూడా చదవండి:

====================

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లిలో సినీ ప్రముఖుల సందడి


*****************************

*Yatra Raja: ధనుష్‌ పెద్ద కుమారుడికి జరిమానా.. ఎందుకంటే?

********************************

*Panja Vaishnav Tej: ‘వరుణ్‌లవ్’ వెడ్డింగ్‌ పార్టీలో రీతూ వర్మ.. రూమర్స్‌కు వైష్ణవ్ చెక్

****************************

Updated Date - 2023-11-21T14:24:57+05:30 IST