సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

The Kerala Story: కథ నిజమని నిరూపించండి.. కోటీశ్వరులు కండి!

ABN, First Publish Date - 2023-05-02T19:02:24+05:30

‘ది కేరళ స్టోరీ’ సినిమాలో చెబుతున్న కథ కనుక నిజమని నిరూపిస్తే.. ఆ నిరూపించిన వారికి రూ. కోటి 21 లక్షల రివార్డ్ అందనుంది. అదెలా అంటే..

The Kerala Story Poster
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతులు ఏమయ్యారు, ఎక్కడున్నారు? అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). ఇప్పుడీ చిత్ర విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 5న ఈ సినిమా విడుదల కావాలి. అయితే ఇటీవల వదిలిన ఈ చిత్ర ట్రైలర్‌ చూసి పలు వర్గాలు, రాజకీయ పార్టీలు (Political Parties) అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. కేరళలో తప్పిపోయిన నలుగురు అమాయకపు యువతులు మతం మార్చుకుని, ఐసిస్‌ ఆధ్వర్యంలో ఉగ్రవాదులుగా మారినట్లు ఈ ట్రైలర్‌లో చూపించడం వివాదానికి (Controversy) కారణమైంది. ఈ సినిమా కేరళలో విడుదల చేయకుండా నిషేధించాలనే డిమాండ్‌ మొదలైంది. కేరళలో కనిపించకుండా పోయిన 32 వేల మంది యువతులు మతం మార్చుకుని ఉగ్రవాదులుగా పని చేస్తున్నారని ట్రైలర్‌లో చూపించడంతో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళను ప్రపంచం ముందు అవమానించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారనీ, లవ్‌ జిహాదీ తమ రాష్ట్రంలో లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఇప్పుడీ సినిమాలో చెబుతున్న కథ కనుక నిజమని నిరూపిస్తే.. ఆ నిరూపించిన వారికి రూ. కోటి 21 లక్షల రివార్డ్ అందనుంది. అదెలా అంటే..

కాంగ్రెస్ సారథ్యంలోని యుడీఎఫ్‌ (UDF)లో రెండో అతి పెద్ద యూత్ వింగ్ అయిన ఐయుఎమ్ఎల్‌ (IUML)లోని ముస్లిం యూత్ లీగ్ అధ్యక్షుడైన పి.కె. ఫిరోజ్ (P.K. Firoz).. ఈ సినిమాని ఎవరైతే నిర్మిస్తున్నారో.. వారు ఇందులో చెప్పిన స్టోరీలైన్ నిజమని నిరూపిస్తే రూ. కోటి ఇస్తానని ఛాలెంజ్ విసిరారు. ‘మా దగ్గర ప్రామాణికమైన గణాంకాలు ఉన్నాయని, 32 వేల మంది బాలికలను సిరియా తీసుకెళ్లారని చెప్పినప్పుడు.. కేరళలోని ప్రతి పంచాయితీ నుంచి కనీసం 30 మంది అందులో ఉండాలి. కానీ ఆ వివరాలు అడుగుతుంటే మాత్రం సమాధానం లేదు’’ అని పి.కె. ఫిరోజ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.

పి.కె. ఫిరోజ్ మాత్రమే కాకుండా.. బ్లాగర్ కె. నజీర్ హుస్సేన్ (K. Nazeer Hussain).. 32 వేల మంది యువతులు మతం మార్చుకుని ఉగ్రవాదులుగా పని చేస్తున్నారని ఆధారాలు చూపిస్తే.. రూ. 10 లక్షలు బహుమతికి ఇస్తానని ప్రకటించారు. 32 వేల మంది కాదు కనీసం 32 మంది అయినా ఇలా మతం మార్చుకున్నారని ఆధారాలతో నిరూపిస్తే రూ. 11 లక్షలు ఇస్తానని కేరళ న్యాయవాది, నటుడు సి. షుక్కు (Lawyer and also an actor Shukkur) ప్రకటించారు. ఇలా మొత్తంగా ఇప్పటి వరకు ఈ కేరళ కథపై ఆధారాలు చూపించమంటూ.. రూ. కోటి 21 లక్షల రివార్డ్‌ను ప్రకటించారు. ఇదిలా ఉంటే.. చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్‌ (Sudipto Sen) మాత్రం.. ‘కేరళలో కొన్ని నెలలు ఉండి రీసెర్చి చేసిన తర్వాత, బాధిత కుటుంబాలతో మాట్లాడిన తర్వాత తీసిన సినిమా ఇది’ అని అంటున్నారు. ‘కేరళ గురించి వ్యతిరేకంగా తీసిన సినిమా కాదిది. అలాగే ఉగ్రవాదులను టార్గెట్‌ చేస్తూ చిత్రం తీశామే తప్ప.. ముస్లీముల గురించి కాదు. ముఖ్యమంత్రిగారూ ఒకసారి మా సినిమా చూడండి. మీకు నచ్చని అంశాలు ఉంటే అప్పుడు చర్చిద్దాం’ అని నిర్మాత విపుల్‌ షా (Vipul Amrutlal Shah) చెప్పారు. మరి ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని ఈ సినిమా మే 5న థియేటర్లలోకి వస్తుందా? అంటే అనుమానమే.

ఇవి కూడా చదవండి:

************************************************

*Naga Chaitanya: నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను బాధపడలేదు

*Sarath Kumar: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 సినిమాలు

*Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్

*PS2: కలెక్షన్ల ఊచకోత మొదలైంది..

*Dil Raju: మేరా దిల్ ఖుష్ హువా..

Updated Date - 2023-05-02T19:02:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!