కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Unstoppable with NBK: ‘వైల్డెస్ట్ ఎపిసోడ్ ప్రోమో’.. బాలయ్యను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ హీరో..!

ABN, First Publish Date - 2023-11-18T14:32:11+05:30

ఆహా ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అంటూ నందమూరి నటసింహం హోస్ట్ చేస్తున్న షో సాగిస్తున్న వేట ఎలా ఉందో, ఉంటుందో తెలియంది కాదు. బాలయ్య అడిగే ప్రశ్నలు, ఆడించే ఆటలు జనాలకి యమా కిక్ ఇస్తున్నాయి. తాజాగా ఈ షో ‌లో ‘యానిమల్’ టీమ్ సందడి చేసింది. నవంబర్ 24న ఆహాలో ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.

Balayya in Unstoppable With NBK Show

ఆహా ఓటీటీ(Aha OTT)లో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ (Unstoppable With NBK) అంటూ నందమూరి నటసింహం బాలకృష్ణ (NBK) హోస్ట్ చేస్తున్న షో సాగిస్తున్న వేట ఎలా ఉందో, ఉంటుందో తెలియంది కాదు. బాలయ్య (Balayya) అడిగే ప్రశ్నలు, ఆడించే ఆటలు జనాలకి యమా కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మూడో సీజన్‌లోకి అడుగుపెట్టింది. రీసెంట్‌గా ‘భగవంత్ కేసరి’ టీమ్ హంగామాతో మూడో సీజన్ మొదలైంది. ఈ షో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కు చేరింది. పాన్ ఇండియా రేంజ్ షో‌కి సంబంధించిన ప్రోమోని తాజాగా ఆహా యూనిట్ వదిలింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్’. ఈ మూవీ ప్రమోషన్స్‌ నిమిత్తం హీరో, హీరోయిన్‌లతో కలిసి దర్శకుడు ఈ షో‌లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని ‘వైల్డెస్ట్ ప్రోమో’ అంటూ మేకర్స్ శనివారం ఓ వీడియోని విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తూ.. వైరల్ అవుతోంది. (Animal Wildest Episode Promo)

ముఖ్యంగా ఇందులో బాలయ్య సినిమాలలోని డైలాగ్స్‌ని ఒక్క మిస్టేక్ కూడా లేకుండా రణబీర్ కపూర్ చెబుతుంటే.. ఆశ్చర్యపోవడం బాలయ్య వంతైంది. ముందుగా ఈ ప్రోమోలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తాగే మందు బ్రాండ్ మార్చమంటూ బాలయ్య చెబుతుంటే చూస్తున్నవారంతా గోల గోల చేశారు. మా బ్రాండ్‌(మెన్షన్ హౌస్)కి వచ్చెయ్.. తొందరగా రాయడం స్టార్ట్ చేస్తావ్ అంటూ బాలయ్య ఆట పట్టించారు. దర్శకుల గురించి బాలయ్య అడుగుతూ బోయపాటి పేరు చెప్పగానే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ గుడిలో ఉంటుందని సందీప్ చెప్పారు. త్రివిక్రమ్‌ గురించి అడగగానే ముసి ముసి నవ్వులతో సందీప్ సిగ్గుపడ్డారు. అనంతరం రణబీర్ కపూర్ గ్రాండ్ ఎంట్రీ. రాగానే ‘ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం ముందు కాదు’ అనే డైలాగ్ చెప్పడంతో అక్కడ కూర్చుని ఉన్న ప్రేక్షకులు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. రణబీర్‌తో కాసేపు ముచ్చటించిన తర్వాత రష్మికను బాలయ్య ఓ కవిత చదువుతూ స్టేజ్ మీదకి పిలిచారు. రష్మిక వచ్చినప్పటి నుంచి బాలయ్య మనసు కంట్రోల్ తప్పింది. ‘నా మనసు బ్యాలెన్స్‌లో లేదిక, ఎందుకో మైండ్ అంతా తికమక. వచ్చేయమ్మా రష్మిక’ అని పిలిచిన బాలయ్య.. ఆమె రాగానే గులాబీ ఇచ్చి, ఆమెతో కలిసి స్టెప్పులేశారు. ‘రష్మిక డ్యాన్స్ చేస్తూ మెలికలు తిరుగుతుంటే నా గుండె మెలికలు తిరుగుతుంది’ అంటూ రష్మికపై తన ఇష్టాన్ని తెలియజేశారు. ఆమె వచ్చాక.. నువ్వు చాలు ఆ ఇద్దరు ఎందుకు అంటూ రణబీర్, సందీప్‌లను పంపించేద్దాం అనగానే వారిద్దరూ లేచి వెళ్లిపోబోయారు. ‘పుష్ప 2’ చేస్తూ ఇంకా ఏమైనా చేస్తున్నావా? అనగానే తెలుగులో ఒకటి, బాలీవుడ్‌లో ఒకటి చేస్తున్నానని రష్మిక చెప్పుకొచ్చింది. ఈ విషయం సుకుమార్‌కి తెలుసా? అంటే తెలుసని రష్మిక సమాధానమిచ్చింది. (Unstoppable with NBK Season 3)


విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రణబీర్ కపూర్ సినిమా పోస్టర్స్‌ని చూపించి ఇద్దరిలో ఎవరు బాగున్నారు? అని రష్మికను బాలయ్య అడిగారు. ఆమె సమాధానం చెప్పలేక నవ్వింది. ఆ తర్వాత ‘పైసా వసూల్’ సాంగ్‌కు బాలయ్య, రణబీర్, రష్మిక కలిసి స్టెప్పులేశారు. విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి.. రష్మికతో మాట్లాడించి.. సందీప్‌కు ఫోనిచ్చి నీ హీరోకి చెప్పు ‘ఐ లవ్ రష్మిక’ (I Love Rashmika) అని బాలయ్య అంటారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అనంతరం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అనే డైలాగ్‌ను రణబీర్ కపూర్ గుక్కతిప్పుకోకుండా చెప్పడంతో బాలయ్య ఆశ్చర్యపోయారు. ‘యానిమల్’ (Animal) టీమ్ సందడి చేసిన ఈ షో ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 24న ఆహా (Aha)లో స్ట్రీమింగ్ కానుంది. ‘యానిమల్’ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.


ఇవి కూడా చదవండి:

========================

*Varalaxmi Sarathkumar: ‘కోట బొమ్మాళి పీఎస్‌’ ఎలా ఉంటుందంటే..?

************************************

*KR Vijaya: కెఆర్ విజయ @ 60

*****************************

Updated Date - 2023-11-18T14:32:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!