Prema Vimanam: ‘ప్రేమ విమానం’ ఓటీటీలో దూసుకెళుతోంది..

ABN , First Publish Date - 2023-10-25T21:04:56+05:30 IST

అక్టోబ‌ర్ 13 నుంచి ‘పేమ విమానం’ సినిమా జీ5 లైబ్ర‌రీలో భాగ‌మైంది. భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5తో క‌లిసి ఈ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. సంతోష్ కాటా ద‌ర్శ‌కుడు. ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నట్లుగా తాజాగా జీ5 ఓటీటీ సంస్థ పేర్కొంది. విడుద‌లైన కొన్నిరోజుల్లోనే ఈ వెబ్ ఫిల్మ్ 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకున్నట్లుగా జీ5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా తెలిపారు.

Prema Vimanam: ‘ప్రేమ విమానం’ ఓటీటీలో దూసుకెళుతోంది..
Prema Vimanam Still

అక్టోబ‌ర్ 13 నుంచి ‘పేమ విమానం’ (Prema Vimanam) సినిమా జీ5 (Zee 5) లైబ్ర‌రీలో భాగ‌మైంది. భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5తో క‌లిసి ఈ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. సంతోష్ కాటా ద‌ర్శ‌కుడు. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు.. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఈ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించారు. ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నట్లుగా తాజాగా జీ5 ఓటీటీ సంస్థ పేర్కొంది. విడుద‌లైన కొన్నిరోజుల్లోనే ఈ వెబ్ ఫిల్మ్ 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకోవ‌టం విశేషం.

ఈ సంద‌ర్బంగా జీ5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా (Manish Kalra) మాట్లాడుతూ.. ‘‘జీ 5ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తోన్న తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ‘పులి మేక, వ్య‌వ‌స్థ‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘ప్రేమ విమానం’ వ‌ర‌కు తెలుగు ఆడియెన్స్ త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తూనే ఉన్నారు. ‘ప్రేమ విమానం’ సినిమా ఇప్ప‌టికే 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకోవ‌టం ఆనందంగా ఉంది. మంచి క‌థ‌, దానికి త‌గ్గ‌ట్టు న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌లు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ‘ప్రేమ విమానం’ ఓ ఇన్‌స్పైరింగ్ స్టోరీ. క‌లల‌ను నేర‌వేర్చుకోవాల‌నుకునే పిల్లలు, ప్రేమించి ఒక్క‌టవ్వాల‌నే యువ జంట‌.. ఇవ‌న్నీ ఎంతో ఆస‌క్తిక‌రంగా మెప్పించాయి. దీన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించినందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది’’ అని అన్నారు.


Prema-Vimanam.jpg

సంగీత్ శోభన్ (Sangeeth Soban), శాన్వీ మేఘన (Saanvi Meghana) హీరో హీరోయిన్లుగా నటించారు. జీ5లో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ తర్వాత ‘ప్రేమ విమానం’తో మరో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు సంగీత్ శోభన్. ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.


ఇవి కూడా చదవండి:

============================

*Venkatesh: పెళ్లిపీటలు ఎక్కబోతోన్న వెంకీ రెండో కుమార్తె.. కుర్రాడెవరో తెలుసా?

**********************************

*Bhagavanth Kesari: 100 కోట్ల క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్ల వివరాలివే..

***************************************

*Japan: అనుతో టచ్చింగ్ టచ్చింగ్ పాటేసుకున్న కార్తీ.. పెప్పీ అండ్ మాసీ!

**************************************

*Bubblegum: రోషన్‌ కనకాల మూవీ నుండి మరో రొమాంటిక్ పిక్..

********************************

*Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?

**********************************

Updated Date - 2023-10-25T21:04:56+05:30 IST