Puli Meka: లావణ్య త్రిపాఠి కష్టానికి ఫలితం దక్కిందట..

ABN , First Publish Date - 2023-02-25T21:45:39+05:30 IST

జీ 5 (Zee5), కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ (Kona Film Corporation) సంయుక్తంగా నిర్మించిన ఒరిజినల్ సిరీస్ (Web Series) ‘పులి మేక’ (Puli Meka). ఫిబ్రవరి 24 నుంచి ఈ సిరీస్

Puli Meka: లావణ్య త్రిపాఠి కష్టానికి ఫలితం దక్కిందట..
Puli Meka Web Series Success Meet

జీ 5 (Zee5), కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ (Kona Film Corporation) సంయుక్తంగా నిర్మించిన ఒరిజినల్ సిరీస్ (Web Series) ‘పులి మేక’ (Puli Meka). ఫిబ్రవరి 24 నుంచి ఈ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతూ.. మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్రలో నటించిన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నటనపై చిత్ర బృందం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు వస్తున్న ఆదరణతో సంతోషంలో ఉన్న చిత్రయూనిట్.. తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ఆది సాయికుమార్ (Aadi Saikumar) మాట్లాడుతూ.. ‘‘ఈ పులి మేక విషయంలో ముందుగా కోనగారికి.. త‌ర్వాత జీ 5 వారికి థాంక్స్‌. లాక్ డౌన్ కంటే ముందే ఓ ఓటీటీ ఆఫ‌ర్ వ‌చ్చింది. అప్పుడు చేయాలా వ‌ద్దా? అని ఆలోచించుకుంటున్నాను. చివ‌రికి వ‌ద్ద‌ని అనుకున్నాను. లాక్ డౌన్ ప‌డింది. త‌ర్వాత చేద్దామ‌నుకుంటే మంచి ప్రాజెక్ట్ దొర‌క‌లేదు. అలాంటి స‌మ‌యంలో కోన‌గారు పులి మేక క‌థ‌ను వినిపించారు. స్క్రిప్ట్, క్యారెక్ట‌రైజేష‌న్ బాగా న‌చ్చింది. లావ‌ణ్య‌గారు హీరోయిన్ అన్నారు. చ‌క్రిగారు డైరెక్ట‌ర్‌గా చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. ఓటీటీ మంచి డెబ్యూలాగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన జీ 5కి థాంక్స్‌. మా అమ్మ‌గారు స‌హా యు.ఎస్‌లో నా రిలేటివ్స్ చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. లావ‌ణ్య అద్భుతంగా న‌టించింది. త‌ను యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ప‌డ్డ క‌ష్టం క్లియ‌ర్‌గా తెలిసింది. సిరి కూడా చ‌క్క‌గా న‌టించింది. రాజా, నోయెల్ ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించారు. వ‌ల్గారిటీ లేదు. ఫ్యామిలీస్ అందరూ క‌లిసి ఎంజాయ్ చేయవ‌చ్చు. సిరీస్ ఎంగేజింగ్‌గా ఆకట్టుకుంటోంది..’’ అన్నారు.

aadi.jpg

లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘‘ఇంత మంచి ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిన కోన వెంక‌ట్‌గారికి, దాన్ని ఇంకా అద్బుతంగా డైరెక్ట్ చేసిన చ‌క్రిగారికి థాంక్స్‌. ఇంకా మా కార్యక్రమానికి వచ్చిన గెస్టులంద‌రికీ స్పెష‌ల్ థాంక్స్‌. ఆది సాయికుమార్‌గారు చాలా సెటిల్డ్‌గా న‌టించారు. జీ 5కి, నాకు స‌పోర్ట్ చేసిన టీమ్‌కి థాంక్స్‌’’ అని తెలిపారు. (Lavanya Tripathi Speech)

రచయిత, నిర్మాత కోన వెంక‌ట్ (Kona Venkat) మాట్లాడుతూ.. ‘‘నేను ఫస్ట్ టైమ్ రైటర్‌గా వర్క్ చేసిన హీరోలందరికీ బ్లాక్ బ‌స్ట‌ర్స్ వ‌చ్చాయి. అదే సెంటిమెంట్ ఆది విష‌యంలోనూ నిజ‌మైంది. పులి మేక సిరీస్ పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. యు.ఎస్‌, యు.కె., జ‌ర్మ‌నీ ఇలా అన్నీ చోట్ల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వ‌స్తుంది. లావ‌ణ్య‌, ఆది నుంచి ప్ర‌తి ఒక్క ఆర్టిస్ట్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా న‌టించారు. ఇక డైరెక్ట‌ర్ చ‌క్రి తెర‌కెక్కించిన తీరు ఎంతో బావుందని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. లావ‌ణ్య న‌ట‌న చూసిన వారందరూ స‌ర్‌ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యారు. ఆమె కష్టానికి వచ్చిన ఫలితంగా భావిస్తున్నారు. అలాగే ఆది విష‌యానికి వ‌స్తే ఒక వైపు అమాయ‌కంగా, మ‌రో వైపు తెలివైన వాడిగా చేయ‌టం చాలా క‌ష్టం. త‌ను హోం వ‌ర్క్ చేసి మరీ యాక్ట్ చేశాడు. ఇక లావ‌ణ్య అయితే ప్ర‌తీ సీన్‌ని చాలెంజింగ్‌గా తీసుకుని న‌టించింది. అలాగే ప్ర‌తీ ఒక్క‌రూ ప్రాణం పెట్టి వ‌ర్క్ చేవారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా యూనిట్‌కు అభినందనలు తెలిపారు. (Puli Meka Web Series Success Meet)

ఇవి కూడా చదవండి

*********************************

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?


GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-25T21:45:39+05:30 IST