కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ala Ninnu Cheri: అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలోకి ‘అలా’ వచ్చేసింది

ABN, Publish Date - Dec 23 , 2023 | 08:23 PM

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ నటించిన ‘అలా నిన్ను చేరి’ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథా చిత్రంగా ‘అలా నిన్ను చేరి’ సినిమాని మేకర్స్ తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడిక ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ‘అలా నిన్ను చేరి’ స్ట్రీమింగ్ అవుతోంది.

Ala Ninnu Cheri Movie Still

దినేష్ తేజ్ (Dinesh Tej), హెబ్బా పటేల్ (Hebah Patel), పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) నటించిన ‘అలా నిన్ను చేరి’ (Ala Ninnu Cheri) సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథా చిత్రంగా ‘అలా నిన్ను చేరి’ సినిమాని మేకర్స్ తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడిక ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీ (Amazon Prime Video)లో ‘అలా నిన్ను చేరి’ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుందని.. మారేష్ శివన్ కథ, కథనం, దర్శకత్వంకు అందరూ ఫిదా అయ్యారని, మరీ ముఖ్యంగా మాటలు గుండెల్ని హత్తుకుంటాయనేలా ఆడియన్స్ నుండి ఈ సినిమాకు ఫీడ్ బ్యాక్ వచ్చిందని మేకర్స్ పేర్కొన్నారు. ఓటీటీలో ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని వారు భావిస్తున్నారు.


ఇంకా మేకర్స్ ఈ సినిమా గురించి చెబుతూ.. ‘హుషారు’ తర్వాత మళ్లీ దినేష్ తేజ్‌కు ఆ రేంజ్‌లో సక్సెస్ వచ్చింది. సక్సెస్‌తో పాటుగా నటుడిగా దినేష్ తేజ్‌కు విమర్శకుల ప్రశంసలు అందాయి. పాయల్ రాధాకృష్ణ, హెబ్బా పటేల్ అందాలు, వారి నటన సినిమా విజయంలో కీలక పాత్రలను పోషించాయి. మహబూబ్ బాషా, మహేష్ ఆచంట, చమ్మక్ చంద్ర ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు ప్రేక్షకుల్ని నవ్వించారు. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ మేజర్ అస్సెట్‌గా నిలిచింది. సుభాష్ ఆనంద్ అందించిన సంగీతం సినిమాకు బలంగా మారింది. రీ రికార్డింగ్ ఈ సినిమాకు ప్లస్‌గా నిలిచిందని వెల్లడించారు. (Ala Ninnu Cheri in Amazon Prime)

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు. కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా సినిమాకు బాధ్యతలు నిర్వర్తించారు. అమెజాన్ ప్రైమ్ అభిమానులకు ఈ వీకెండ్ ఓ చక్కని తెలుగు చిత్రంగా ఈ సినిమా ఆకర్షించనుందని నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Animal: ‘యానిమల్’లో రణబీర్ తల్లిగా చేసిన నటి వయసు ఎంతో తెలుసా? హీరో రణబీర్ కంటే..?

***************************

*Mohan Babu: కలెక్షన్ కింగ్ నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్

***************************

*Bandi Trailer: నగ్నంగా టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతోన్న ట్రైలర్

*****************************

Updated Date - Dec 23 , 2023 | 08:23 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!