రేలంగి, గిరిజ ఎంత ఫేమస్సో.. ఈ జంట కూడా అంతే ఫేమస్

ABN , First Publish Date - 2023-12-10T17:46:23+05:30 IST

రేలంగి, గిరిజ తర్వాత కొన్నేళ్ల పాటు తెలుగు సినీ హాస్య ప్రపంచాన్ని ఏలేసిన జంట పద్మనాభం, గీతాంజలి. వీళ్లు సినిమాలో ఉన్నారని తెలిస్తే చాలు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి థియేటర్‌కు వచ్చేవారు. 1960 ద్వితీయార్ధంలో ఏ సినిమా చూసినా ఈ హాస్యజంట ఆడియన్స్‌ను అలరించేది. అందుకే ఆ రోజుల్లో పద్మనాభం, గీతాంజలి సినిమాలో ఉన్నారో లేరో తెలుసుకుని మరీ పెట్టుబడి పెట్టేవారు పంపణీదారులు.

రేలంగి, గిరిజ ఎంత ఫేమస్సో.. ఈ జంట కూడా అంతే ఫేమస్
Padmanabham and Geethanjali

రేలంగి (Relangi), గిరిజ (Giraja) తర్వాత కొన్నేళ్ల పాటు తెలుగు సినీ హాస్య ప్రపంచాన్ని ఏలేసిన జంట పద్మనాభం (Padmanabham), గీతాంజలి (Geethanjali). వీళ్లు సినిమాలో ఉన్నారని తెలిస్తే చాలు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి థియేటర్‌కు వచ్చేవారు. 1960 ద్వితీయార్ధంలో ఏ సినిమా చూసినా ఈ హాస్యజంట ఆడియన్స్‌ను అలరించేది. అందుకే ఆ రోజుల్లో పద్మనాభం, గీతాంజలి సినిమాలో ఉన్నారో లేరో తెలుసుకుని మరీ పెట్టుబడి పెట్టేవారు పంపణీదారులు.

అంతకు ముందు ‘మంచి మనిషి’ వంటి ఒకటి రెండు చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించినా పద్మనాభం సొంత సినిమా ‘దేవత’ చిత్రం నుంచి ఈ జంట మరింత పాపులర్‌ అయింది. ఆ తర్వాత ఆయన నిర్మించిన ‘పొట్టి ప్లీడరు’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు గీతాంజలి. మళ్లీ ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంలో పద్మనాభం సరసన ఆమె నటించారు. తన సొంత చిత్రాల్లో గీతాంజలికి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు పద్మనాభం. (Padmanabham and Geethanjali)


Geethanjali.jpg

అందుకే నటిగా తనకు సినీ జన్మ ఎన్టీఆర్‌ (NT Ramarao) ఇస్తే, ఎన్నో చిత్రాల్లో తనకు మంచి అవకాశాలు ఇచ్చి హాస్య నటిగా ఎలివేట్‌ చేసింది పద్మనాభమేనని కృతజ్ఞతతో చెప్పేవారు గీతాంజలి. పద్మనాభం నిర్మించిన ‘ఆజన్మ బ్రహ్మచారి’లో రామకృష్ణ (Ramakrishna) సరసన గీతాంజలి నటించారు. ఆ తర్వాత రామకృష్ణనే పెళ్లి చేసుకుని ఆయన నిజజీవిత కథానాయిక అయ్యారు.


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!

************************************

*Manushi Chhillar: నా గాళ్స్‌ గ్యాంగ్‌ని వెంటేసుకొని.. చుట్టొస్తా!

*******************************

*Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం

***********************************

Updated Date - 2023-12-10T17:46:24+05:30 IST