Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం

ABN , First Publish Date - 2023-12-10T10:53:25+05:30 IST

‘డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్’ సినిమాలలో నటించి, హీరోయిన్‌గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది నేహా శెట్టి. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌లో రాధికగా ఫేమ్ అయ్యింది. కావాల్సినంత క్రేజ్ ఉన్నా.. వరుసగా సినిమాలు చేయడం లేదు నేహా శెట్టి. తనకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని.. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోవడం లేదని చెబుతుందీ యంగ్ బ్యూటీ.

Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం
Neha Shetty

‘డీజే టిల్లు (DJ Tillu), బెదురులంక 2012 (Bedurulanka 2012), రూల్స్ రంజన్ (Rules Ranjann)’ సినిమాలలో నటించి, హీరోయిన్‌గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది నేహా శెట్టి (Neha Shetty). ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌లో రాధికగా ఫేమ్ అయ్యింది. కావాల్సినంత క్రేజ్ ఉన్నా.. వరుసగా సినిమాలు చేయడం లేదు నేహా శెట్టి. తనకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని.. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోవడం లేదని చెబుతుందీ యంగ్ బ్యూటీ. మంచి సినిమాలు చేసి, మరింతగా ప్రేక్షకుల ఆదరణ పొందాలని నేహా శెట్టి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Neha-2.jpg

రీసెంట్‌గా న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో 4 నెలల కోర్స్ చేసింది నేహా శెట్టి. నటిగా తనను తాను మెరుగుపర్చుకోవడంలో ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడిందని నేహా శెట్టి చెబుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ.. నటిగా వైవిధ్యంగా కనిపించాలి, భిన్నమైన క్యారెక్టర్స్‌లో నటించాలనే నా ప్రయత్నానికి న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో చేసిన కోర్స్ బాగా హెల్ప్ అవుతోంది. ఈ కోర్స్ ద్వారా నేర్చుకున్న విషయాలతో నటిగా మరింత మెరుగయ్యాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari) సినిమాలో బుజ్జి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని చెప్పింది.


Neha.jpg

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘సుట్టంలా సూసి’ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచి.. ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ పాటలో నేహా శెట్టి గ్లామర్ యూత్ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: మహేష్‌కి ముద్దు.. సెకండ్ సింగిల్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైనట్లే..

*********************************

*Director Sai Kiran Daida: స్క్రీన్‌కి అతుక్కొని మరీ ‘పిండం’ సినిమా చూస్తారు..

********************************

*Thandel: నాగ్ స్విచ్.. వెంకీ క్లాప్.. అరవింద్ స్క్రిఫ్ట్

***********************************

Updated Date - 2023-12-10T10:53:26+05:30 IST