కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Producers: ఈ డిజిటల్ యుగంలో.. మంచి కంటెంట్‌కు ఆదాయ మార్గాలెన్నో!

ABN, First Publish Date - 2023-10-17T20:53:18+05:30

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ప్రొడ్యూసర్ బజార్ నిర్వహించిన ‘ఐ.పి.రైట్స్- కాపీ రైట్స్ ఇన్ సినిమా’ సదస్సులో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ డిజిటల్ యుగంలో మంచి కంటెంట్ అనేది నిర్మాతలకు కల్పతరువు వంటిదని.. ఈ సదస్సులో ఎంతో విపులంగా విశదీకరించినట్లుగా తెలుస్తోంది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) సహకారంతో ప్రొడ్యూసర్ బజార్ నిర్వహించిన ‘ఐ.పి.రైట్స్- కాపీ రైట్స్ ఇన్ సినిమా’ సదస్సులో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ (Tollywood Producers), డైరెక్టర్స్ (Directors) పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘ఎన్నో వ్యయప్రయాసలతో... జీవితాలను పణంగా పెట్టి నిర్మాతలు రూపొందించిన కంటెంట్‌పై వారికి ఎప్పటికీ కొన్ని హక్కులు ఉంటాయి. ఏదో ఒకసారి, లేదా ఏదో ఒక మార్గంలో ఆదాయం ఇచ్చేది కాదు కంటెంట్ అంటే. ఈ డిజిటల్ యుగంలో మంచి కంటెంట్ అనేది నిర్మాతలకు కల్పతరువు వంటిది’ అంటూ.. ఈ సదస్సులో ఎంతో విపులంగా విశదీకరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా కంటెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని... వివిధ ఆదాయ మార్గాలపై, హక్కులకు సంబంధించిన పలు రకాల అంశాలపై ప్రతి నిర్మాత పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సదస్సు నొక్కి చెప్పిందని నిర్మాతలు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


‘ఐ.పి.రైట్స్ - కాపి రైట్స్ ఇన్ సినిమా’ (IP Rights and Copyrights In Cinema) అనే అత్యంత కీలకమైన అంశాలపై ఇప్పటికే... ప్రొడ్యూసర్ బజార్ తమిళ, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఛాంబర్స్ సహకారంతో అక్కడి నిర్మాతలకు సమగ్ర అవగాహన కల్పించింది. అక్కడి నిర్మాతలందరూ ఈ అవగాహన తాలూకు సత్ఫలితాలు పొందడం కూడా మొదలైంది. ఇప్పుడు... తెలుగు నిర్మాతలలోనూ ఈ అవగాహన పెంపొందించేందుకు నడుం కట్టింది. అందులో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో జత కట్టి ఈ సదస్సును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బజార్ వ్యవస్థాపకులు జి.కె.తిరుణావకరసు, విజయ్, ఐ.పి.రైట్స్ - కాపి రైట్స్ అంశాల్లో నిష్ణాతులు, సుప్రసిద్ధ సుప్రీం కోర్టు లాయర్ భరత్‌లతో పాటు... తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలుగు దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఎన్.ఆదిత్య, ప్రముఖ నిర్మాతలు స్రవంతి రవికిషోర్, జెమిని కిరణ్, శరత్ మరార్, సుప్రియ యార్లగడ్డ (అన్నపూర్ణ స్టూడియో), బెక్కం వేణుగోపాల్, వల్లూరిపల్లి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Rajinikanth: విజయ్‌ ‘లియో’ ఘన విజయం సాధించాలి

**************************************

*Kajal Aggarwal: బాలయ్య ఇలాంటి కథ చేసినందుకు నేను హ్యాపీ!

****************************************

*Leo: ‘లియో’ ఫీవర్‌.. 9కి వద్దు.. ఉదయం 4, 7 గంటల ఆట కోసం పట్టు

*****************************************

*Japan: దీపావళికి థియేటర్లలోకి.. ఈలోపే పోస్టర్స్‌తో పేల్చేస్తున్నారు

*****************************************

*Sona: ఆ చిన్న పొరపాటు వల్లే నన్ను శృంగార తారను చేశారు

***************************************

Updated Date - 2023-10-17T20:53:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!