కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bunny Vas: జనసేన పార్టీలో నిర్మాత బన్నీ వాస్‌కు కీలక బాధ్యత

ABN, First Publish Date - 2023-12-14T20:25:49+05:30

జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్‌గా నిర్మాత బన్నీ వాస్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియామక ఉత్తర్వులను స్వయంగా పవన్ కళ్యాణే.. బన్నీ వాస్‌కు అందజేశారు. ప్రచార విభాగం పార్టీకి కీలకమైందని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా బన్నీ వాస్‌కు పవన్ కళ్యాణ్ సూచించారు.

Pawan Kalyan and Bunny Vas

జనసేన పార్టీ (Janasena Party) ప్రచార విభాగం ఛైర్మన్‌గా నిర్మాత బన్నీ వాస్‌ (Bunny Vas)ను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నియమించారు. గురువారం మంగళగిరి(Mangalagiri)లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియామక ఉత్తర్వులను స్వయంగా పవన్ కళ్యాణే.. బన్నీ వాస్‌కు అందజేశారు. ప్రచార విభాగం పార్టీకి కీలకమైందని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా బన్నీ వాస్‌కు పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. పార్టీ ఉన్నతి కోసం మరింతగా కష్టపడాలని ఈ సందర్భంగా బన్నీ వాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.


బన్నీ వాస్ విషయానికి వస్తే.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) నిర్మాత అల్లు అరవింద్‌కు బన్నీ వాస్ కుడి భుజం లాంటి వారు. బన్నీ వాస్ స్ర్కిప్ట్ జడ్జిమెంట్‌ని అల్లు అరవింద్ (Allu Aravind) బాగా నమ్ముతారు. అందుకే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ స్థాపించి.. ఆ బాధ్యతలని బన్నీ వాస్‌కి అప్పగించారు మెగా నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ద్వారా కొత్త కొత్త నిర్మాతలని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. విజయవంతంగా బన్నీ వాస్ ఆ సంస్థను ముందుకు తీసుకెళుతున్నారు. సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాతగానూ బన్నీ వాస్ పేరు పొందారు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రచార విభాగపు రథసారధిగా ఆయన ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

====================

*Gudumba Shankar: జనసేన పార్టీకి ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ఆదాయం

************************************

*Kushee Ravi: ఐకాన్ స్టార్, న్యాచురల్ స్టార్ అంటే ఇష్టం..

**********************************

*Salaar: ‘సూరీడే..’ పాట.. ‘సలార్’ స్ట్రెంత్ ఇది

*************************************

*Mass Combo: మ్యాజికల్ మాస్ కాంబో ఈజ్ బ్యాక్.. కాకపోతే ఇవే డౌట్స్!

*****************************************

Updated Date - 2023-12-14T20:28:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!