Jawan’s OTT Rights: కొనేందుకు పోటీ పడుతున్న ఓటీటీలు.. ‘పఠాన్’ని మించిపోయేలా ఉందిగా..

ABN , First Publish Date - 2023-04-03T17:54:57+05:30 IST

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan) ఇటీవలే విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది.

Jawan’s OTT Rights: కొనేందుకు పోటీ పడుతున్న ఓటీటీలు.. ‘పఠాన్’ని మించిపోయేలా ఉందిగా..
Jawan

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan) ఇటీవలే విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ పిల్మ్‌ నిర్మించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో షారుఖ్ తదుపరి చిత్రం ‘జవాన్’ పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ చేస్తుండగా.. నయన తార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తోంది. నయన తారకి ఈ మూవీనే మొదటి చిత్రం కావడం విశేషం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సినీ లవర్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటి. అయితే.. భారీ బడ్జెట్‌తో మరో రెండు ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ (Digital Rights) కొనేందుకు ఓటీటీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. (OTT Rights)

ఇప్పటికే ‘పఠాన్’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ.100 కోట్లకు కోనేసింది. దీంతో ఈ మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అంతకంటే ఎక్కువ పెట్టేందుకు ఓటీటీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తెరకెక్కితున్న ‘జవాన్’ చిత్ర యూనివర్సల్ అప్పీల్‌ ఉన్నందున మంచి వ్యూయర్‌షిప్ వచ్చే అవకాశం ఉందని ఓటీటీ యాజమాన్యాలు భావిస్తున్నాయట. అందుకే ఆ చిత్రానికి భారీ ధరను పెట్టేందుకు వెనుకాడట్లేదని సమాచారం. అన్నింటిలోనూ ఇటీవలికాలంలో భారతీయ చిత్రాలను భారీ ధరకు కొనుగోలు చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏకంగా రూ.120 కోట్లు పెట్టేందుకు ఆ ఓటీటీ సిద్ధమవుతుందట. (Jawan’s OTT Rights To Netflix)

ఇవి కూడా చదవండి:

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

Kangana Ranaut: తనని ట్రోల్ చేయమంటున్న కంగనా.. దేనికోసమంటే..

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-03T17:54:58+05:30 IST