Ravi Teja: రవితేజ పాన్ ఇండియా ఆశలు ఫలిస్తాయా ?

ABN , First Publish Date - 2023-10-04T14:44:32+05:30 IST

రవి తేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వర రావు' హిందీలో విడుదలవుతోంది. మొదటిసారిగా రవితేజ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవడం, హిందీ పాత్రకి కూడా రవి తేజ డబ్బింగ్ చెప్పారు. ముంబై ప్రత్యేకంగా ఈ సినిమా ప్రచారం కోసం వెళ్లి అక్కడ ట్రైలర్ విడుదల చేశారు రవితేజ. మరి ఈ సినిమా రవితేజకి హిందీలో విజయాన్ని ఇస్తుందా...

Ravi Teja: రవితేజ పాన్ ఇండియా ఆశలు ఫలిస్తాయా ?
Ravi Teja

'పుష్ప' Pushpa, 'కార్తికేయ 2' #Karthikeya2 లాంటి సినిమాలు తప్పితే ఎక్కువ తెలుగు సినిమాలు పాన్ ఇండియా అంటూ విడుదల చేసినవి ఏవీ కూడా ఎక్కడా ఆడకపోవడం, టోటల్ ఫ్లాప్ అవటం చూస్తూనే వున్నాం. పైన చెప్పిన రెండు సినిమాలు అచ్చ తెలుగు సినిమాలు, ఇక్కడ కథలు, అంతగా ప్రచారం చెయ్యకపోయినా రెండు సినిమాలు తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో విజయం సాధించాయి.

Pushpa-The-Rule.jpg

'కార్తికేయ 2' హిందీలో కూడా విజయం సాధించింది అని, అందులో కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddhartha) తన తదుపరి సినిమా 'స్పై' #Spy పాన్ ఇండియా అంటూ మొదలెట్టారు, అలాగే ప్రచారాలు చేశారు, అందులో తెలుగు నటులు కాకుండా చాలామంది ఇతర భాషల నటులే ఎక్కువ. కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. అలాగే సందీప్ కిషన్ (SundeepKishan) 'మైకేల్' #Michael అనే పాన్ ఇండియన్ సినిమా తీసాడు, అన్ని భాషల్లో విడుదల చేసాడు, బోల్తా పడింది.

Karthikeya-2.jpg

నాని నటించిన 'దసరా' #Dasara సినిమా కూడా పాన్ ఇండియా సబ్జెక్టు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు, కానీ ఒక్క తెలుగులోనే ఆడింది అది. దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) 'శాకుంతలం' #Shaakuntalam అనే సినిమా పాన్ ఇండియా అంటూ మలయాళం నటుడుని కథానాయకుడిగా, సమంత (Samantha) కథానాయికగా ఒక పౌరాణిక సినిమా తీశారు. కానీ అది కూడా అన్ని భాషల్లో బోల్తా కొట్టింది. డిజాస్టర్ అయింది. అఖిల్ అక్కినేని (AkhilAkkineni) 'ఏజెంట్' #Agent, దుల్కర్ సల్మాన్ (DulquerSalman) 'కింగ్ అఫ్ కొత్త' #KingOfKotha, నాగ చైతన్య నటించిన 'కస్టడీ' ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా తయారయ్యాయి.

Spy-Movie.jpg

ఇక్కడ ఒకటి గమనించాలి, పాన్ ఇండియా అని సినిమాలో కథ మార్చి, పోరాట సన్నివేశాలు ఎక్కువ పెట్టి, తెలుగు నటులు కాకుండా, మిగతా భాషల నటులను తీసుకొచ్చి వాళ్ళకి రాని భాషలో ఇక్కడ మాట్లాడించి ఇన్ని చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. ఎందుకంటే ఆ కథలన్నీ మిగతా భాషల వాళ్ళకి కొత్తగా వుండవు, ఆ నటులు కూడా కొత్త కాదు. వాళ్ళకి కావాల్సింది మన తెలుగు కథలు, మన తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఇక్కడ ఎలా ఉంటాయి అని. అందుకే 'పుష్ప' బ్రహ్మాండంగా అన్ని భాషల్లో ఆడింది. 'బాహుబలి' #Baahubali 'ఆర్ఆర్ఆర్' #RRR ఆడింది, 'కాంతారా' #Kantara, 'కేజీఎఫ్' ఇలా కొన్ని సంచనాలు సృష్టించాయి. ఎందుకంటే అవన్నీ లోకల్ కథలు.

tigernageswararao2.jpg

ఇప్పుడు రవితేజ (RaviTeja) తన 'టైగర్ నాగేశ్వర రావు' #TigerNageswaraRao సినిమా పాన్ ఇండియాలో విడుదల చేస్తా అని, ముందుగా ముంబై వెళ్లి అక్కడ ప్రచారం చేసుకు వచ్చారు. ట్రైలర్ అక్కడ విడుదల చేశారు. కానీ పాన్ ఇండియా అంటూ తీసిన సినిమాల ఫలితాలు చూసాం కదా, మన కథలు మానేసి, ఈ పాన్ ఇండియా మోజులో పడి తెలుగు దర్శకులు, నిర్మాతలు, అగ్ర నటులు ఒరిజినల్ కథలని మర్చిపోతున్నారు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. తెలుగు కథలు అక్కడ (బాలీవుడ్) చూపిస్తే వాళ్ళకి కొత్త, అదే నటులతో వాళ్ళకి కావాల్సినట్టుగా తీస్తే, వాళ్ళకి మొహం మొత్తేస్తుంది. మరి రవితేజ తెలుగు కథ చూపిస్తున్నారా, లేదా పాన్ ఇండియా కి అనుగుణంగా కథని మార్చి, పోరాటాలు పెట్టి, పరభాషా నటులను పెట్టేసి విడుదల చేస్తే అక్కడ విజయం లభిస్తుందా? వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-10-04T14:45:33+05:30 IST