కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

We Love Bad Boys: సెన్సార్ పూర్తి చేసుకున్న కడుపుబ్బే కామెడీ ఎంటర్‌టైనర్‌‌

ABN, Publish Date - Dec 19 , 2023 | 10:34 PM

నూతన నిర్మాణ సంస్ధ బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ (We Love Bad Boys). రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి ఈ సినిమా U/A సర్టిఫికెట్‌ను పొందింది.

We Love Bad Boys stills

నూతన నిర్మాణ సంస్ధ బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ (We Love Bad Boys). రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి ఈ సినిమా U/A సర్టిఫికెట్‌ను పొందింది. కడుపుబ్బే కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య తారాగణం. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.


నేటి ట్రెండ్‌కు తగిన కథ-కథనాలతో ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర దర్శకులు రాజు రాజేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమ బ్యానర్‌కు శుభారంభం ఇస్తుందనే నమ్మకంతో ఉన్నామని నిర్మాత పప్పుల కనక దుర్గారావు అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ‘రఘు కుంచె’తో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌కు రచన - దర్శకత్వం రాజు రాజేంద్రప్రసాద్. (We Love Bad Boys Censor Completed)


ఇవి కూడా చదవండి:

====================

*Bigg Boss Telugu 7 Winner: ‘BB’నే విన్నర్.. టాప్ 2, 3 స్థానాలకే వారు పరిమితం

*******************************

*Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 5 ప్రియాంక, టాప్ 4 యావర్

*******************************

*Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 6 కంటెస్టెంట్స్‌ నుండి అర్జున్ అవుట్..

*******************************

Updated Date - Dec 19 , 2023 | 10:34 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!