Bigg Boss Telugu 7 Winner: ‘BB’నే విన్నర్.. టాప్ 2, 3 స్థానాలకే వారు పరిమితం

ABN , First Publish Date - 2023-12-17T23:03:23+05:30 IST

దాదాపు 105 రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 7 ఫినాలే ఘట్టం ముగిసింది. టాప్ 6 కంటెస్టెంట్స్‌గా ఉన్న పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌‌లలో.. భూమి బిడ్డ, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్‌గా నిలిచారు.

Bigg Boss Telugu 7 Winner: ‘BB’నే విన్నర్.. టాప్ 2, 3 స్థానాలకే వారు పరిమితం
Pallavi Prashanth Is The Bigg Boss Telugu Season 7 Winner

దాదాపు 105 రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 7 ఫినాలే ఘట్టం ముగిసింది. టాప్ 6 కంటెస్టెంట్స్‌గా ఉన్న పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌‌లలో.. అర్జున్ టాప్ 6 స్థానం, ప్రియాంక టాప్ 5, ప్రిన్స్ యావర్ టాప్ 4 మరియు రూ. 15 లక్షలతో హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యారు. విన్నర్, టాప్ 2, టాప్ 3 స్థానాల విషయంలో కాసేపు ఉత్కంఠని కలిగించినా.. ముందుగానే వచ్చిన లీక్‌ల మాదిరిగానే ఈ షో‌లో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయ్యారు. ఫైన‌ల్‌గా ఎమ్ ఎమ్ కీరవాణి చెప్పిన ‘భూమి బిడ్డ’ (BB)నే బిస్‌బాస్ సీజన్ 7 ట్రోపీని కైవసం చేసుకున్నారు. ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి.. ఫైనల్‌‌లో విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల క్యాష్, మారుతి సుజుకీ కారు, రూ. 15 లక్షల వర్త్ జాస్ అలుక్కాస్ గోల్డ్‌ను గెలుచుకున్నారు. కింగ్ నాగార్జున పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినట్లుగా ప్రకటించడంతో.. పల్లవి ప్రశాంత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక టాప్ 2 మరియు రన్నర్‌గా అమర్ దీప్ నిలిచాడు. టాప్ 3 స్థానంతో శివాజీ సరిపెట్టుకున్నాడు. ఇలా ఈ బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. (Pallavi Prashanth)

Bigg Boss 7 Winner.jpg

ప్రిన్స్ యావర్ ఎలిమినేటై.. స్టేజ్‌పైకి వచ్చిన అనంతరం తనకు అప్పులు ఉండడం కారణంగా రూ. 15 లక్షల తీసుకుంటున్నట్లుగా తెలిపారు. అతనితో ముచ్చట తర్వాత ‘డెవిల్’ సినిమా ప్రమోషన్ నిమిత్తం స్టేజ్‌పైకి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్.. సినిమా విశేషాలతో పాటు టాప్ 3 కంటెస్టెంట్‌గా శివాజీ ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు. అంతే, పల్లవి ప్రశాంత్ ఒక్కసారిగా శివాజీ కాళ్లపై పడి భోరుభోరున ఏడ్చేశాడు. ఆపైన మిగిలిన ఇద్దరిని హౌస్ నుండి తీసుకొచ్చేందుకు కింగ్ నాగార్జున హౌస్‌లోకి వెళ్లారు. అక్కడ బిగ్ బాస్ కింగ్ నాగార్జున జర్నీని చూపించి.. మిగిలిన ఇద్దరినీ స్టేజ్‌పై తీసుకుని వచ్చారు. (Bigg Boss Telugu Season 7 Winner Pallavi Prashanth)


Sivaji.jpg

స్టేజ్‌పై ఎప్పటిలానే కాసేపు సస్పెన్స్ సృష్టించిన అనంతరం పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినట్లుగా కింగ్ నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత కాసేపు భావోద్వేగాలు నడిచాయి. రన్నర్‌గా నిలిచిన అమర్ దీప్.. ప్రశాంత్ గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌ని చేసిన అందరికీ ప్రశాంత్ శిరస్సు వంచి నమస్కరించాడు. తన జర్నీని మరోసారి స్టేజ్‌పై చెప్పుకొచ్చాడు. గెలుచుకున్న రూ. 35 లక్షల అమౌంట్‌ను రైతుల కోసమే ఖర్చు పెడతానని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాడు. కారు తన తండ్రికి, గోల్డ్ తన తల్లికి ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఫైనల్‌గా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రశాంత్.. రన్నర్ అమర్ దీప్.. ఇంతటితో ఈ సీజన్ ముగిసింది అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 5 ప్రియాంక, టాప్ 4 యావర్

*******************************

*Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 6 కంటెస్టెంట్స్‌ నుండి అర్జున్ అవుట్..

*******************************

*Mr Bachchan: రవితేజ, హరీష్ శంకర్.. ఏందయ్యో ఈ స్పీడ్.. అప్పుడే క్లాప్ కూడా!

**********************************

*Sumaya: ‘డియర్ ఉమ’‌తో మల్టీ టాలెంట్‌ ప్రదర్శించబోతోన్న అనంతపురం అమ్మాయ్..

************************************

Updated Date - 2023-12-17T23:08:24+05:30 IST