scorecardresearch

Nani30: ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-07-11T22:27:43+05:30 IST

నేచురల్ స్టార్ నాని ల్యాండ్‌మార్క్ మూవీ Nani30 ఫస్ట్ లుక్ వచ్చేందుకు టైమ్ ఫిక్సయింది. నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే విషయం ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ జూలై 13న విడుదల కానుందని తెలుపుతూ మేకర్స్ ఓ వీడియోని విడుదల చేశారు.

Nani30: ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..
Natural Star Nani

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ల్యాండ్‌మార్క్ మూవీ Nani30 (#Nani30) ఫస్ట్ లుక్ వచ్చేందుకు టైమ్ ఫిక్సయింది. నూతన దర్శకుడు శౌర్యువ్‌ (Shouryuv) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే విషయం ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాని కొన్ని ఎక్సోటిక్ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో నాని డిఫరెంట్ లుక్, క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ విడుదలకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. (Nani30 First Look and Glimpse Release Date)


#Nani30 ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ జూలై 13న విడుదల కానుందని తెలుపుతూ ఓ వీడియోని విడుదల చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో నాని పారాగ్లైడింగ్ చేస్తూ కనిపించారు. సినిమా కోసం నాని ఎలాంటి రిస్క్ తీసుకున్నారో ఇది స్పష్టంగా సూచిస్తుంది. మరొక వీడియోలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఇదే అనౌన్స్‌మెంట్ చేస్తూ ‘ప్రవహించే సముద్రంలా, ప్రేమ మమ్మల్ని చుట్టుముట్టింది, మిమ్మల్ని చేరుకుంటుంది’ అని కోట్ చేశారు. ఈ ప్రకటనతో ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ వస్తుందా అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ (Vyra Entertainments) పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రం యూనిక్ స్టోరీ లైన్‌తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Taarakasura: ‘రావణాసుర’ కాదు.. ఇతను ‘తారకాసుర’

**************************************

*Dhwani: దర్శకుడిగా 10 ఏళ్ల పిల్లాడు.. అతని టార్గెట్ ఏంటో తెలుసా?

**************************************

*Bholaa Shankar: సెలబ్రేషన్ సాంగ్ వచ్చేసింది.. కీర్తి, తమన్నాలతో చిరు స్టెప్పులు

********************

*Mani Sharma: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘మణి’హారం

**************************************

*Thaman S: ట్రోల్స్‌పై సంగీత దర్శకుడు థమన్ ఏమన్నారంటే..

**************************************

Updated Date - 2023-07-11T22:27:43+05:30 IST