Mani Sharma: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘మణి’హారం

ABN , First Publish Date - 2023-07-11T12:56:31+05:30 IST

ఎవరి పేరు చెబితే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బీజీఎమ్ బద్దలవుతుందో.. ఎవరి పేరు.. నటరాజును నాట్యమాడించగలదో.. ఎవరి పేరు.. సంగీత కిరీటానికి సరితూగగలదో.. ఆయనే మణిశర్మ. పదేళ్ల క్రితం ఇది పేరు కాదు.. ఇదొక బ్రాండ్. స్టార్ హీరోలు సైతం ఆయన కోసం క్యూ కట్టి.. వారి సినిమా పోస్టర్‌లో పేరు కోసం ప్రాకులాడారంటే.. ఆ పేరుకి, ఆయన ఇచ్చే సంగీతానికి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అటువంటి మణిశర్మ పుట్టినరోజు నేడు.

Mani Sharma: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘మణి’హారం
Music Director Mani Sharma

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఇంద్ర’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇంద్రసేనా రెడ్డి క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ..

ఎవరి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్లు ఆనందంతో పులకరిస్తుందో,

ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో,

ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలుగా మారతాయో.. అనే డైలాగ్స్ మాదిరిగా..

ఎవరి పేరు చెబితే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బీజీఎమ్ బద్దలవుతుందో..

ఎవరి పేరు.. నటరాజును నాట్యమాడించగలదో..

ఎవరి పేరు.. సంగీత కిరీటానికి సరితూగగలదో.. ఆయనే మణిశర్మ. పదేళ్ల క్రితం ఇది పేరు కాదు.. ఇదొక బ్రాండ్. స్టార్ హీరోలు సైతం ఆయన కోసం క్యూ కట్టి.. వారి సినిమా పోస్టర్‌లో పేరు కోసం ప్రాకులాడారంటే.. ఆ పేరుకి, ఆయన ఇచ్చే సంగీతానికి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పూర్తి పేరు నమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీ మణిహారంగా నిలిచేందుకు ఆయన మార్చుకున్న పేరు ‘మణిశర్మ’. (Music Director Mani Sharma)


మెగాస్టార్ మాస్ స్టెప్స్ వేయాలన్నా.. నటసింహం ఊరమాస్ డైలాగ్స్ చెప్పాలన్నా.. కింగ్ కుర్రహీరోయిన్లని కవ్వించాలన్నా.. విక్టరీ సెంటిమెంట్‌తో కొట్టాలన్నా.. వెనుక మణిశర్మ చేతులు కదలాల్సిందే. నేను కాదు.. నా సంగీతమే మాట్లాడుతుంది అంటూ.. ఎప్పుడూ, ఎక్కడా ఇప్పుడున్న సంగీత దర్శకుల్లా.. అతిగా మాట్లాడిందీ లేదు, వారిలా ఆవేశపడిందీ లేదు. ఒకటే స్ట్రాటజీ.. తన మ్యూజిక్కే తనకు ప్రాణం. కుర్ర సంగీత దర్శకులు వచ్చాక.. ఒక అడుగు వెనక్కి పడి ఉండవచ్చు.. కానీ మంచి ఛాన్స్ పడితే.. ఇప్పటికీ ఇరక్కొట్టగలనని ‘ఇస్మార్ట్’గా నిరూపిస్తూనే వస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా కుర్ర సంగీత దర్శకుల వెంట పడుతుంటే.. కుర్ర హీరోలు మాత్రం మణిశర్మ ట్యాగ్ తమ సినిమా టైటిల్ కార్డ్స్‌లో ఉంటే మహాభాగ్యం అనుకునేలా.. అన్ని రకాల హీరోలను శాటిస్‌ఫై చేస్తున్న స్వరమాంత్రికుడు మణిశర్మ. (Mani Sharma Birthday Special)

Manisharma.jpg

ఇప్పుడంతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ.. సినిమా పరంగా అదొక పెద్ద యజ్ఞం అని ఫీలైపోతున్నారు. గతంలో కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కానీ.. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ని ఇచ్చింది మాత్రం మణిశర్మే. చిరంజీవికి స్టార్ స్టేటస్‌ని ఇచ్చింది ‘ఖైదీ’ సినిమా అయితే.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌‌కి కమర్షియల్ స్టేటస్ ఇచ్చింది మణిశర్మ. పాటల కంటే కూడా ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి దర్శకనిర్మాతలు, ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే.. అది మణిశర్మ క్రియేట్ చేసిన హిస్టరీ. అటువంటి హిస్టరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మణిశర్మ పుట్టినరోజు నేడు (July 11). హ్యాపీబర్త్‌డే టు మణిశర్మ (#HBDManiSharma).

మణిశర్మ స్వరపరిచిన ప్రతి పాటా ఆణిముత్యమే. అందులో కొన్ని బెస్ట్ సాంగ్స్ చెప్పుకోవాలంటే..

చూడాలనివుంది: యమహానగరి, రామ్మా చిలకమ్మా

ఇంద్ర: భం భం భోలే, దాయి దాయి దామ్మా

ఖుషి: అమ్మాయే సన్నగా.. , చెలియా చెలియా

తీన్‌మార్: గెలుపు తలుపులే, వయ్యారాలా జాబిల్లి

ఒక్కడు: చెప్పవే చిరుగాలి, నువ్వే మాయ చేశావో

ఖలేజా: సదా శివ సన్యాసి, పిలిచే పెదవుల పైన

రావోయి చందమామ: స్వప్న వేణువేదో, ఝమ్మని ఝమ్మని

బాణం: నాలో నేనేనా, కదిలే పాదం

సమరసింహారెడ్డి: అందాల ఆడబొమ్మ, రావయ్య ముద్దుల మావ

నరసింహానాయుడు: నిన్నా కుట్టేసినాది, చిలక పచ్చ కోక

దేవీపుత్రుడు: తెల్లతెల్లని చీర, ఆకాశంలోని చందమామ

మురారి: ఎక్కడ ఎక్కడ ఉందో, అలనాటి రామచంద్రుడు

ఆది: నీ నవ్వుల తెల్లదనాన్ని

సుబ్బు: నాకోసమే నువ్వు పుట్టావని

చిరుత: ఛమ్క ఛమ్క

అతిథి: సత్యం ఏమిటో..

పరుగు: నమ్మవేమోగానీ, హృదయం ఓర్చుకోలేనిది.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ పాటలన్నీ ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ‘మెలోడీ బ్రహ్మ’గా ఆయనపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ముగ్గురికి అత్యధికంగా 11 చిత్రాలకు చొప్పున సంగీతం అందించారు. ఆయన ఏ ఈవెంట్ చేసినా.. అందులో ముఖ్యంగా యమహానగరి, సదా శివ సన్యాసి, నాలో నేనేనా, గెలుపు తలుపులే.. వంటి పాటలని ఎక్కువగా అడిగి పాడించుకునే వారని ఆయన చెబుతుంటారు.

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అయిన మణిశర్మ.. కొన్ని చిత్రాలకు ప్రత్యేకంగా ఆ డిపార్ట్‌మెంట్‌నే నిర్వహించారు కూడా. ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన కొన్ని బెస్ట్ చిత్రాల గురించి చెప్పుకుంటే..

గణేష్, చూడాలని వుంది, సమరసింహారెడ్డి, ఇంద్ర, మృగరాజు, నరసింహనాయుడు, దేవీ పుత్రుడు, మురారి, ఖుషి, టక్కరిదొంగ, ఆది, చెన్నకేశవరెడ్డి, ఒక్కడు, ఠాగూర్, అంజి, సాంబ, శ్రీ ఆంజనేయం, అర్జున్, అతడు, బాలు, పోకిరి, స్టాలిన్, బిల్లా, డాన్ శీను, ఖలేజా, తీన్‌మార్, ఇస్మార్ట్ శంకర్, లై, రెడ్, రిపబ్లిక్ వంటి ఎన్నో చిత్రాలకు ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిన్ ప్రాణం పోసింది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Thaman S: ట్రోల్స్‌పై సంగీత దర్శకుడు థమన్ ఏమన్నారంటే..

**************************************

*Viraj Ashwin: ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందంటోన్న యంగ్ హీరో

**************************************

*Brahmaji: మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్.. తర్వాత మనం కష్టపడాల్సిందే..

**************************************

*Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?

**************************************

Updated Date - 2023-07-11T16:37:18+05:30 IST