Kushi: మహేష్ బాబు బర్త్‌డేకి విజయ్ దేవరకొండ ఇస్తోన్న ట్రీట్ ఇదే..

ABN , First Publish Date - 2023-08-07T18:21:02+05:30 IST

ఆగస్ట్ 9 సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకి మహేష్ బాబు నుంచి ఎటువంటి ట్రీట్ వస్తుందోననే న్యూస్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం నేను ట్రీట్ ఇస్తానని అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆగస్ట్ 9న విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు.

Kushi: మహేష్ బాబు బర్త్‌డేకి విజయ్ దేవరకొండ ఇస్తోన్న ట్రీట్ ఇదే..
Vijay Deverakonda and Mahesh Babu

ఆగస్ట్ 9 సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకి మహేష్ బాబు నుంచి ఎటువంటి ట్రీట్ వస్తుందోననే న్యూస్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ (Mahesh Babu Fans) కోసం నేను ట్రీట్ ఇస్తానని అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). విజయ్ దేవరకొండ, సమంత (Samantha) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ (Kushi). పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీకి శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నారు. అంటే మహేష్ బాబు పుట్టినరోజున విజయ్ దేవరకొండ అందరికీ ట్రైలర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడన్నమాట. (Kushi Trailer Release Details)


అలాగే సెప్టెంబర్ 1న రిలీజ్ అంటున్నారు అంటే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కు కూడా ట్రీట్ ఇస్తున్నట్టే. ఎలా అంటే.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఒక రోజు ముందే ఆయన చేసిన సినిమా టైటిల్‌తో విజయ్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కూడా ఇది ట్రీటే అని చెప్పుకోవాలి. మొత్తంగా అయితే.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌ల ఫ్యాన్స్‌ని ఈ రౌడీ హీరో టార్గెట్ చేసినట్లుగా అయితే కనిపిస్తోంది. మరి ఆగస్ట్ 9న వచ్చే ట్రైలర్, సెప్టెంబర్ 1న వచ్చేసినిమా ఎలా ఉంటాయో చూడాలి.

Kushi-Still.jpg

ఈ ‘ఖుషి’ (Kushi) సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ మాత్రం మంచి స్పందనను రాబట్టుకున్నాయి. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు రికార్డ్ వ్యూస్‌ని రాబడుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ‘ఖుషి’ ట్రైలర్‌పై (Kushi Trailer) కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Jawan: మ‌రోసారి లుంగీ డ్యాన్స్‌తో.. ఈసారి దుమ్ములేచిపోవడం ఖాయం


***************************************

*Samantha: రూ. 25 కోట్లా? నేనూ వర్క్ చేశా.. అందుకు రాళ్లూరప్పలేం ఇవ్వలేదు

***************************************

Updated Date - 2023-08-07T18:21:02+05:30 IST