సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tamannaah Bhatia: బాలయ్య సినిమాలో ఐటమ్‌.. బాధపడుతోన్న మిల్కీ బ్యూటీ

ABN, First Publish Date - 2023-05-20T16:53:48+05:30

NBK108 సినిమాలో తమన్నా భాటియా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా తమన్నా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది

Tamannaah Bhatia and Balakrishna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘NBK108’. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) ఓ ప్రముఖ పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) విలన్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ (Shine Screens) బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

అంతకు ముందు అనిల్ రావిపూడి ‘F’ సిరీస్ చిత్రాలలో తమన్నా (Tamanna) హీరోయిన్‌గా నటించడంతో.. ఈ సినిమాలో ఆమెతో ఓ స్పెషల్ ‌సాంగ్‌ (Special Song)ని అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఒకే సినిమాలో కాజల్, తమన్నా‌లతో బాలయ్య ఆడుకోబోతున్నాడనేలా టాక్ మొదలైన నేపథ్యంలో తమన్నా బాధపడుతూ ఓ ట్వీట్ వేసింది. ఈ సినిమాలో నేను భాగం కావడం లేదంటూ మిల్కీ బ్యూటీ (Milky Beauty) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాజాగా ఆమె చేసిన ట్వీట్‌లో ఏం చెప్పిందంటే.. (Tamanna Tweet)

‘‘దర్శకుడు అనిల్ రావిపూడి సార్‌తో వర్క్ చేయడాన్ని నేనెప్పుడూ ఎంజాయ్ చేస్తాను. అనిల్ రావిపూడిగారిపైన అలాగే నందమూరి బాలకృష్ణగారిపైనా నాకు ఎంతో గౌరవం ఉంది. అయితే వారిద్దరూ కలిసి చేస్తున్న చిత్రంలో నేనొక పాట చేస్తున్నాననే వార్త నన్నెంతో బాధపెట్టింది. ఎటువంటి ఆధారాలు లేకుండా వచ్చే ఇటువంటి వార్తలను నమ్మకండి. నిజమో కాదో.. ఒక్కసారి తెలుసుకుని రాయండి’’ అంటూ తమన్నా తన ట్వీట్‌లో పేర్కొంది. తమన్నా ఇచ్చిన ఈ సమాధానంతో.. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో ఆమె నర్తించడం లేదనే క్లారిటీ వచ్చేసింది. మరి ఇప్పుడామె ప్లేస్‌లో అనిల్ రావిపూడి ఎవరిని తీసుకొస్తాడో చూడాలి. అయితే ‘F3’లో ఓ కీలక పాత్రలో నటించిన సోనాల్ చౌహాన్‌ (Sonal Chauhan)‌కి అనిల్ ఛాన్సిచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే, ఆల్రెడీ ఆమె బాలయ్యతో కూడా నటించింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Bichagadu: ‘బిచ్చగాడు’కు, ఈ నోట్ల రద్దుకు లింకేంటి సామీ!

*HappyBirthdayNTR: పవర్ హౌస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

*2018: తెలుగు ప్రేక్షకుల ముందుకు రూ. 100 కోట్లు రాబట్టిన చిత్రం.. ఎప్పుడంటే?

*Orange: జనసేనాని చేతికి ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్‌ ఆదాయం

*Pan India Stars: ఒకే స్టేజ్‌పై పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఎందుకో తెలిస్తే..!

Updated Date - 2023-05-20T17:01:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!