Suman: మెగాస్టార్ అభిమాని తీసిన సినిమా ఇది.. మెగా ఫ్యాన్సే హిట్ చేయాలి

ABN , First Publish Date - 2023-06-23T20:05:52+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి అభిమాని తీసిన ‘మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్’ సినిమాని మెగాభిమానులు హిట్ చేయాలని పిలుపునిచ్చారు సీనియర్ హీరో సుమన్. జూలై 7న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా తెలిపేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సుమన్.. ఇందులో రైతు పాత్రలో నటించినట్లుగా తెలిపారు. మెగా ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని చూసి సక్సెస్ చేయాలని ఆయన కోరారు.

Suman: మెగాస్టార్ అభిమాని తీసిన సినిమా ఇది.. మెగా ఫ్యాన్సే హిట్ చేయాలి
Senior Hero Suman

మెగాస్టార్ చిరంజీవి అభిమాని తీసిన ‘మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్’ (Mohan Krishna Gang Leader) సినిమాని మెగాభిమానులు హిట్ చేయాలని పిలుపునిచ్చారు సీనియర్ హీరో సుమన్. జై యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్రియేషన్స్ సమర్పణలో యస్.యం.కె.ఫిల్మ్స్ పతాకంపై మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా శ్రీ లక్ష్మణ్ దర్శకత్వంలో సింగూలూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించి.. చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో సుమన్ (Suman) మాట్లాడుతూ.. మా అమ్మగారు చెన్నైలో ఒక స్కూల్‌కు ప్రిన్సిపాల్. సూపర్ స్టార్ కృష్ణ‌గారి కుమార్తె, శోభన్ బాబుగారి కుమార్తె, తమిళనాడు గవర్నర్‌గారి కూమార్తె.. వీళ్లంతా మా అమ్మ స్టూడెంట్స్. ఎంతోమంది పేద విద్యార్థులకు తన సొంత డబ్బుతో చదువు చెప్పించింది. మా తల్లితండ్రులు చేసిన పుణ్యం ఒక ఎత్తయితే.. నన్ను నమ్మి నాకు సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతల పుణ్యమే నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టేలా చేసింది. మొదట దర్శకుడు గ్యాంగ్ లీడర్ కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. రైతులు (Farmers) ఇబ్బందులు పడుతున్న ఒక బర్నింగ్ ఇష్యూపై నా క్యారెక్టర్ ఉంటుంది. రైతు పాత్రలో నటించినందుకు చాలా హ్యాపీ‌గా ఉంది. ఎందుకంటే రైతులేని రాష్ట్రం లేదు, రైతులేని దేశం లేదు. కరోనా టైమ్‌లో మనము బయట పడ్డాము అంటే.. అది రైతుల వలనే. వారి ద్వారానే మనందరికీ ఫుడ్ లభించింది. వారు చేసిన కష్టం ఎప్పటికీ మరువలేము. ఇలాంటి మంచి చిత్రంలో రైతు పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. చిరంజీవి అభిమాని అయిన మోహన్ కృష్ణ ఇందులో హీరోగా చాలా బాగా నటించాడు. మంచి కాన్సెప్ట్‌తో.. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే విధంగా ఈ సినిమా తెరకెక్కించారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన గ్యాంగ్ లీడర్ (Gang Leader) టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను మెగాభిమానులు (Mega Fans) బిగ్ హిట్ చేసి నిర్మాత‌కు సపోర్ట్‌గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

Suman-in-Gang-Leader.jpg

చిత్ర హీరో మోహన్ కృష్ణ (Mohan Krishna) మాట్లాడుతూ.. ఒక చిన్న పాయింట్‌ను తీసుకొని సినిమా తీస్తున్న ఈ రోజుల్లో ఒక కొత్త కథను సెలెక్ట్ చేసుకొని ఒక రైతు మీద, ఫ్రెండ్స్ మీద, రాజకీయం, స్నేహం ఇలా ఒక ఐదు బర్నింగ్ ఇష్యూస్ గురించి ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. నేను హీరోగా నటించినా ఈ సినిమాకు అసలు హీరో సుమన్ గారే. తను ఇందులో చాలా బాగా నటించారు. ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నటించడం జరిగింది. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మొదట టైటిల్ గురించి డిస్కషన్ చేస్తున్న సమయంలో.. మాకు ప్రసన్న కుమార్‌గారే ఈ టైటిల్ పెట్టమని చెప్పారు. మోహన్ కృష్ణ ‘గ్యాంగ్ లీడర్’ సినిమా జూలై 7న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని తెలుపగా.. చిత్ర దర్శకుడు శ్రీ లక్ష్మణ్ (Sri Lakshman) మాట్లాడుతూ.. రైతు గురించి మంచి కాన్సెప్ట్ తీసుకొని చేసిన ఈ సినిమాలో జై కిషన్, జై జవాన్ అనే నినాదం ఎంత గొప్పదో.. అందరికీ తెలియజేశామని అన్నారు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు అని తెలిపారు. (Mohan Krishna Gang Leader Ready to Release)

ఇవి కూడా చదవండి:

**************************************

*BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..


**************************************

*Sreeleela: దేవాలయం కంటే గొప్పది.. ఆ విషయం బాలయ్యకి కూడా తెలియదు.


**************************************

*Spy Trailer Talk: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?


**************************************

*Rashmika Mandanna: మేనేజర్‌తో విభేదాలనే వార్తలపై రష్మిక ఏమందంటే..


**************************************

*MAA: టాలీవుడ్, బాలీవుడ్ సరిహద్దులను చెరిపేస్తున్న ‘మా’


**************************************

Updated Date - 2023-06-23T20:05:52+05:30 IST