MAA: టాలీవుడ్, బాలీవుడ్ సరిహద్దులను చెరిపేస్తున్న ‘మా’

ABN , First Publish Date - 2023-06-22T19:38:39+05:30 IST

ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, బాలీవుడ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కలిసి పనిచేయబోతున్నాయని తెలిపారు ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు. ‘మా’ కోశాధికారి శివ బాలాజీ కలిసి జూన్ 17న ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి రెండు అసోసియేషన్‌లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతిపాదన ఉంచగా.. దానికి హిందీ పరిశ్రమ అంగీకారం తెలిపినట్లుగా తాజాగా మంచు విష్ణు ప్రకటించారు.

MAA: టాలీవుడ్, బాలీవుడ్ సరిహద్దులను చెరిపేస్తున్న ‘మా’
Maa and Cintaa Team

మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఇప్పుడు సరికొత్త మైలురాయిని చేరుకుంది. భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఏకం చేసే మిషన్‌ను ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు (Manchu Vishnu) ప్రారంభించారు. అందులో భాగంగా విష్ణు మంచు మరియు ‘మా’ కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) కలిసి జూన్ 17న ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి రెండు అసోసియేషన్‌లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతిపాదన ఉంచగా.. దానికి హిందీ పరిశ్రమ (Bollywood) అంగీకారం తెలిపినట్లుగా తాజాగా మంచు విష్ణు ప్రకటించారు. ‘మా’ (MAA), Cinetaa (హిందీ చలనచిత్రం మరియు TV అసోసియేషన్) ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం తెలుగు చిత్ర పరిశ్రమలోని కళాకారులు, బాలీవుడ్ కళాకారుల మధ్య సోదరభావానికి నాంది పలుకుతుందని తాజాగా మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ విష్ణు మంచు (Maa President Manchu Vishnu) మాట్లాడుతూ.. ‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) మరియు బాలీవుడ్ (Bollywood) అసోసియేషన్‌ల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. తెలుగు చిత్రాలలో పని చేసే బాలీవుడ్ కళాకారులకు ‘మా’ సభ్యత్వం అందుతుంది. అలాగే మన తెలుగు నటీనటులు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తే వాళ్ళకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం అందుతుంది. ఏవైనా వివాదాలు తలెత్తితే ‘మా’ వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

Maa.jpg

ఈ ఒప్పందంతో మన తెలుగు నటీనటులకు బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. త్వరలోనే వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం చేసుకోబోతున్నాం. అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబంగా ఉండాలనేనే ఇదంతా చేస్తున్నాం. ‘మా’ సొంత భవనం కల కూడా త్వరలోనే సాకారం అయ్యే అవకాశం ఉంది’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Agent: రైట్స్ విషయంలో దేవుడు కాపాడాడు .. ఏషియన్ సునీల్ సంచలన వ్యాఖ్యలు


**************************************

*Pawan Kalyan: జగన్ రెడ్డి వల్ల నాకు ఎన్ని కోట్లు లాసో తెలుసా? ఆ లాస్ నేనే భరించా?


**************************************

*Varun Sandesh: సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు


**************************************

*Regina: ‘రెజీనా’ కోసం ఈ హీరోయిన్ చేసిన సాహసం ఏంటో తెలుసా?


**************************************

Updated Date - 2023-06-22T19:38:39+05:30 IST