How is That for A Monday: ‘హౌ ఈస్ థట్ ఫర్ ఏ మండే’ టీజర్ ట్రైలర్ శేఖర్ కమ్ములకు నచ్చేసింది

ABN , First Publish Date - 2023-10-25T20:38:40+05:30 IST

నైజాం టాకీస్, మినర్వా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన వ్యంగ్య కథా చిత్రం ‘హౌ ఈస్ థట్ ఫర్ ఏ మండే’. సాధారణంగా మండే (సోమవారం) అంటే కార్పొరేట్ ఆఫీసుల్లో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనులు నిదానంగా మొదలవుతాయి. శనివారం, ఆదివారం సెలవునుండి తిరిగి వచ్చిన ఉద్యోగులలో ఒకటీ రెండు పూటలు స్తబ్ధత నెలకొని ఉంటుంది. అలాంటి వారి పరిస్థితిని క్లియర్ కట్‌గా చూపించే చిత్రమిది.

How is That for A Monday: ‘హౌ ఈస్ థట్ ఫర్ ఏ మండే’ టీజర్ ట్రైలర్ శేఖర్ కమ్ములకు నచ్చేసింది
How is That for A Monday Movie Still

నైజాం టాకీస్, మినర్వా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన వ్యంగ్య కథా చిత్రం ‘హౌ ఈస్ థట్ ఫర్ ఏ మండే’. సాధారణంగా మండే (సోమవారం) అంటే కార్పొరేట్ ఆఫీసుల్లో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనులు నిదానంగా మొదలవుతాయి. శనివారం, ఆదివారం సెలవునుండి తిరిగి వచ్చిన ఉద్యోగులలో ఒకటీ రెండు పూటలు స్తబ్ధత నెలకొని ఉంటుంది. అటువంటి ఒక మండే ఊహకందని మార్పులు చోటు చేసుకుంటే? ప్రియురాలితో గొడవతో మొదలై, అప్పులిచ్చిన వారి బెదిరింపులు, తనకేమాత్రం సంబంధం లేని ఒక క్రైమ్‌లో ఇరుక్కోని, ఆపై దాదాపు ప్రాణాల మీదికి తెచ్చుకొని, ఇలా ప్రతి క్షణం ఊహకందకుండా శ్యామ్ కుమార్ అనే ఒక ఎన్.ఆర్.ఐ. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీవితంలోని ఒక మండే‌ని.. అమెరికాలోని సమకాలీన సామాజిక, ఆర్ధిక వ్యవహారాలతో ముడిపెడుతూ ఆద్యంతం ఆసక్తిగా సాగేలా తీసిన ఒక వ్యంగ్య కథా చిత్రమే ‘హౌ ఈస్ థట్ ఫర్ ఏ మండే’ (How is That for A Monday).

ఈ చిత్రంలో ‘మెన్ టూ, బ్రోచేవారెవరురా’ తదితర చిత్రాలలో నటించిన కౌశిక్ ఘంటసాల (Koushik Ghantashala) హీరోగా, అమెరికన్ నటులు క్యాండిడో కార్టర్, ఎలిస్టర్ ల్యాథం, మేగన్ బార్లో సహ నటులుగా నటించారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు డాన్ విన్సెన్ట్ నేపధ్య సంగీతం, ‘మల్లేశం’ చిత్ర ఫేమ్ రాఘవేందర్ ఉప్పుగంటి కూర్పు సమకూర్చగా, హాలీవుడ్‌లో శిక్షణ పొందిన శ్రీపాల్ సామా (Sripal Sama) రచించి దర్శకత్వం వహించారు. సాయి ప్రణీత్ గౌరవరాజు సహ రచయితగా, ఎమ్మీ అవార్డు విజేత స్కాట్ వుల్ఫ్ శబ్దగ్రాహకుడిగా పని చేశారు. పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో ఎంపికై.. శేఖర్ కమ్ముల, నగేష్ కుకునూర్ వంటి దర్శకుల మన్ననలు పొందిందీ చిత్రం. తాజాగా విడుదల చేసిన టీజర్ ట్రైలర్ కూడా బీభత్సమైన స్పందనను రాబట్టుకుంటోంది. (How is That for A Monday Teaser Trailer Out)


తాజాగా శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘సినిమాను చూశాను.. చాలా బాగా వచ్చింది.. చిన్న క్యూట్ ఫిల్మ్. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు. కౌశిక్ బాగా నటించాడు. డైరెక్టర్ శ్రీపాల్ అద్భుతంగా తీశాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. ఇంగ్లీష్ - తెలుగు భాషల్లో ఈ చిత్రం ఈ నెల 27న హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు‌తో పాటు అమెరికాలోని పలు నగరాల్లో విడుదల కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Venkatesh: పెళ్లిపీటలు ఎక్కబోతోన్న వెంకీ రెండో కుమార్తె.. కుర్రాడెవరో తెలుసా?

**********************************

*Bhagavanth Kesari: 100 కోట్ల క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్ల వివరాలివే..

***************************************

*Japan: అనుతో టచ్చింగ్ టచ్చింగ్ పాటేసుకున్న కార్తీ.. పెప్పీ అండ్ మాసీ!

**************************************

*Bubblegum: రోషన్‌ కనకాల మూవీ నుండి మరో రొమాంటిక్ పిక్..

********************************

*Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?

**********************************

Updated Date - 2023-10-25T20:38:40+05:30 IST