Sakhi: విడుదలకు సిద్ధమైన రియల్ లవ్ స్టోరీ

ABN , First Publish Date - 2023-12-11T20:33:09+05:30 IST

వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘సఖి’. లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల, సందీప పసుపులేటి, సుధాకర్ రెడ్డి, జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా జానీ బాషా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పార్థు రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 15న థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

Sakhi: విడుదలకు సిద్ధమైన రియల్ లవ్ స్టోరీ
sakhi movie stills

వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘సఖి’ (Sakhi). లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల, సందీప పసుపులేటి, సుధాకర్ రెడ్డి, జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా జానీ బాషా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పార్థు రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 15న థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ (Feel Good Love Story)గా.. నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సన్నీ సంకురు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్ కుమార్ కారే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (Sakhi Ready to Release)


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!

************************************

*Manushi Chhillar: నా గాళ్స్‌ గ్యాంగ్‌ని వెంటేసుకొని.. చుట్టొస్తా!

*******************************

*Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం

***********************************

Updated Date - 2023-12-11T20:33:13+05:30 IST