సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Karthika: రెజీనా చదివే బుక్‌లో.. దెయ్యంగా కాజల్ అగర్వాల్!

ABN, First Publish Date - 2023-06-09T17:55:56+05:30

కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, జనని అయ్యర్ ప్రధాన పాత్రలలో నటించిన ‘కరుంగాపియం’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కార్తీక’ పేరుతో టి. జనార్థన్ విడుదల చేస్తున్నారు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయినట్లుగా తెలుపుతూ.. త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.

Regina and Kajal Aggarwal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాజల్, రెజీనా, జనని అయ్యర్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘కార్తీక’. తమిళంలో ‘కరుంగాపియం’ పేరుతో ఇది తెరకెక్కింది. డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించారు. వెంకట సాయి ఫిల్మ్స్ పతాకం‌పై ముత్యాల రామదాసు సమర్పణలో టి జనార్ధన్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో సాగే ఈ చిత్రంలో ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించనున్నారు.

రెజీనా ఒకసారి లైబ్రరీ‌కి వెళ్లి వంద ఏళ్ల క్రితం నాటి కాటుక బొట్టు అనే బుక్ చదువుతుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పే బుక్ అది. అందులోని పాత్రల గురించి ఆమె చదువుతుంటే అవి దెయ్యాలుగా మారి ఆమె ముందుకు రావడం ఎంతో థ్రిల్‌ను కలిగిస్తుంది.

ఈ నేపథ్యంలో తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రను కాజల్ పోషించారు. అలాగే మరో నటి జననీ అయ్యర్ పాత్ర కూడా ప్రేక్షకులని మెప్పించేదిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన దర్శకుడు కార్తికేయన్ ఈ చిత్రాన్ని వైవిధ్యంగా తెరకెక్కించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న టి జనార్ధన్ తెలిపారు. రైజా విల్సన్ (బిగ్ బాస్ తమిళ్ ఫేమ్), ఇరానియన్ నటి నోయిరికా ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ప్రసాద్ ఎస్‌ఎన్ సంగీతం సమకూర్చగా.. విగ్నేశ్ వాసు సినిమాటోగ్రఫీ బాధ్యతని నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను

*Pawan Kalyan OG: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌‌‌పై ఫ్యాన్స్ ట్వీట్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

*Hero Siddharth: ఓ పెద్దావిడను చూసి భోరున ఏడ్చేసిన సిద్ధార్థ్.. ఆమె ఎవరో తెలుసా?

*Adipurush: సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ వచ్చిందో తెలుసా?

Updated Date - 2023-06-09T17:55:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!