Ye Chota Nuvvunna: చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందట..

ABN , First Publish Date - 2023-11-16T14:24:47+05:30 IST

నూతన నిర్మాతలు మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావు సంయుక్తంగా ఎమ్.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పసలపూడి ఎస్.వి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఏ చోట నువ్వున్నా’. ప్రశాంత్, అంబికా ముల్తానీ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్మాతలు చిత్ర విశేషాలను మీడియాకు తెలిపారు.

Ye Chota Nuvvunna: చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందట..
Ye Chota Nuvunnaa Movie Hero and Heroine

నూతన నిర్మాతలు మందలపు శ్రీనివాసరావు (Mandalapu Srinivasa Rao), మేడికొండ శ్రీనివాసరావు (Medikonda Srinivasa Rao) సంయుక్తంగా ఎమ్.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పసలపూడి ఎస్.వి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఏ చోట నువ్వున్నా’ (Ye Chota Nuvunnaa). ప్రశాంత్, అంబికా ముల్తానీ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా.. చిత్ర నిర్మాతలు చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.

వారు మాట్లాడుతూ..

‘‘మాది ఒకరిది గుంటూరు జిల్లా బోదిలవీడు గ్రామం. ఇంకొకరిది ప్రకాశం జిల్లా పుల్లలచెరువు గ్రామం. చిన్ననాటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. ప్రస్తుతం వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులం. సినిమా నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే.. కరోనా టైమ్‌లో ఓటీటీలో కొన్ని మంచి చిత్రాలు చూసినప్పుడు మనం కూడా ఓటీటీకి మంచి కథతో కూడిన చిత్రాన్ని నిర్మించాలని ఆలోచన చేశాం. ఈ విషయాన్ని సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న మా స్నేహితుడు శ్రీ చౌదరితో చెప్పడం, తన ద్వారా దర్శకుడు పసలపూడి ఎస్. వి పరిచయం కావడంతో ఈ చిత్రానికి నాంది పడింది.


Producers.jpg

దర్శకుడు పసలపూడి ఎస్.వి కథ చెప్పినపుడు చాలా మంచి కథ అనిపించింది. వెంటనే సినిమా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు కోసం రాజమండ్రిలో ఆడిషన్స్ నిర్వహించి అందరూ కొత్తవాళ్ళని సెలక్షన్ చేసుకున్నాం. ఇందులో నటించిన హీరోహీరోయిన్లు ప్రశాంత్, అంబికా ముల్తానీల నటన చాలా సహజంగా పల్లెటూరిలో మన పక్కింట్లో వాళ్ళని చూసినట్టు ఉంటుంది. మిగిలిన నటీనటులు అందరూ కథకు న్యాయం చేశారు. (Ye Chota Nuvvunna Producers Interview)

ఈ చిత్రానికి తరుణ్ రాణా ప్రతాప్ ఇచ్చిన సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. చిత్రంలో రెండు పాటలు ప్రేక్షకుల మన్ననలు పొందుతాయి. మా చిత్రానికి డి.ఓ.పిగా చేసిన శ్రీకాంత్ మార్క అనిల్ పీజీ రాజ్ పల్లెటూరు అందాలని చాలా చక్కగా చిత్రీకరించారు. ఎడిటర్ శ్రీవర్కల కూర్పు కూడా మెప్పిస్తుంది. మా చిత్రానికి కథ - మాటలు కుమార్ పిచ్చుక అందించారు. కథతోపాటు మాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరినీ థ్రిల్ చేస్తాయి. దర్శకుడు ఎస్.వి చిత్రం ముగింపుని చాలా కొత్తగా చిత్రీకరించారు. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని, నిర్మాతలగా మాకు మంచి శుభారంభం ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాం. వైజాగ్ శంకర్ సారధ్యంలో ఈ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. సినిమా మేకింగ్ అంటే మాకు చాలా ప్యాషన్. ఈ రంగంలో కలిసే కొనసాగుతాం. కచ్చితంగా మంచి మేకర్స్‌గా పేరు సంపాదించుకుంటాం’’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

========================

*Anushka Sharma: నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు.. కోహ్లీపై అనుష్క శర్మ పోస్ట్ వైరల్

**************************

*Malvika Sharma: ‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్ విడుదల

*******************************

*Namitha Husband: పోలీసుల విచారణకు హాజరుకాని నటి నమిత భర్త.. లేఖలో ఏం చెప్పారంటే?

********************************

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లాడబోయే వ్యక్తి ఇతనే..

**********************************

Updated Date - 2023-11-16T14:24:48+05:30 IST