సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

ABN, First Publish Date - 2023-04-08T11:42:53+05:30

ఓ అందమైన ఇంటిముందు పవిత్ర లోకేష్ ముగ్గు వేస్తుండగా సాంప్రదాయ దుస్తులలో నరేష్ ఆ ముగ్గు వేయడాన్ని ఆనందంగా చూస్తూ కనిపించి..

Pavitra Lokesh and VK Naresh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరేష్, పవిత్ర పెళ్లి చేసుకుంటున్నారా? అందుకు రమ్యరఘుపతి అనుమతి ఇచ్చిందా? ఆ టైటిల్‌‌కి అర్థమేంటి? ఆ అప్‌డేట్ ఏంటి? అని అనుకుంటున్నారు కదా. అంత ఆత్రుత పడొద్దు.. ఎందుకంటే ఇది రియల్ పెళ్లికి సంబంధించిన అప్‌డేట్ కాదు.. రీల్ పెళ్లికి సంబంధించిన అప్‌డేట్. నవరసరాయ డా.నరేష్ వికె (Naresh VK) పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్‌ని పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇటీవల తన గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నరేష్‌ (Naresh)కు జోడీగా పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) నటిస్తోంది. మెగా మేకర్ ఎంఎస్ రాజు (MS Raju) ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తుండగా, నరేషే స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంతో విజయ కృష్ణ మూవీస్‌ (Vijaya Krishna Movies)ను నరేష్ పున:ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.

Also Read-Allu Arjun Birthday Special: గ్లోబల్ స్థాయికి దూసుకెళుతోన్న రేసుగుర్రం

‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి.. ఇంతకు ముందు విడుదల చేసిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో ఓ అందమైన ఇంటిముందు పవిత్ర లోకేష్ ముగ్గు వేస్తుండగా సాంప్రదాయ దుస్తులలో నరేష్ ఆ ముగ్గు వేయడాన్ని ఆనందంగా చూస్తూ కనిపించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ (Malli Pelli First Look) చాలా ఆహ్లాదకరంగా ఉంది. సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనేది ఈ పోస్టర్ చూసిన వారికి అర్థమైంది. అలాగే నరేష్, పవిత్రల కెమిస్ట్రీని ప్రజంట్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు.. వారి రియల్ లైఫ్ (Real Life) పాత్రలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

ఏప్రిల్ 13వ తేదీని టీజర్‌ను (Malli Pelli Teaser Update) విడుదల చేయబోతున్నామంటూ తాజాగా ఓ పోస్టర్ కూడా వదిలారు. ఏడు అడుగులు, రెండు మనసులు, ఒకటే ప్రాణం! అంటూ విడుదల చేసిన ఈ న్యూ పోస్టర్‌లో నరేష్, పవిత్ర.. ఇద్దరూ ప్రేమ చిహ్నాలను (Love Symbol) వేళ్లతో చూపిస్తూ.. లవ్లీగా కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుండటమే కాకుండా.. వీరి పెళ్లికి టైమ్ దగ్గరపడిందనేలా కామెంట్స్‌‌కు కారణమవుతోంది. ‘మళ్ళీ పెళ్లి’ విషయానికి వస్తే.. ఈ సినిమాలో జయసుధ (Jayasudha), శరత్‌బాబు (SarathBabu) కీలక పాత్రలు పోషిస్తుండగా.. తమిళ నటి వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి (Suresh Bobbili) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Shruti Haasan: అందుకే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో చేశా..

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ మోసం చేశాడా?.. అసలా పోస్టర్‌లో ఉందెవరు?

*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

Updated Date - 2023-04-08T11:42:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!