సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

AadiKeshava Glimpse: పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం

ABN, First Publish Date - 2023-05-15T16:51:02+05:30

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘ఆదికేశవ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే..

Panja Vaisshnav Tej in AadiKeshava Movie
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sithara Entertainments), ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ (Fortune Four Cinemas) నిర్మాణ సంస్థలు ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘PVT04’‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌తో పాటు, గ్లింప్స్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. పంజా వైష్ణవ్ తేజ్ తొలిసారి ఓ యాక్షన్ అవతార్‌లో ఈ గ్లింప్స్‌లో కనిపించారు. పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఫిల్మ్‌కు ‘ఆదికేశవ’ (AadiKeshava) అనే పవర్ ఫుల్ టైటిల్‌ని ఖరారు చేశారు. ఇప్పటి వరకు స్టిల్స్‌తోనే సినిమాపై క్రేజ్ పెంచిన చిత్ర బృందం.. ఇప్పుడీ గ్లింప్స్‌తో ఈ సినిమా ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పవర్‌ఫుల్‌గా ప్రజంట్ చేశారు.

‘ఆదికేశవ’ గ్లింప్స్‌ (AadiKeshava First Glimpse)లో పంజా వైష్ణవ్ తేజ్‌ను రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా పరిచయం చేశారు. ఒక చిన్న గ్రామంలో గూండాలు శివాలయాన్ని ఆక్రమించాలని చూస్తుండగా, రుద్ర వారిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది? ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తిని కలిగించేలా గ్లింప్స్ ఉంది. ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా గ్లింప్స్‌ని ముగించిన తీరు ఆకట్టుకుంది. రుద్రగా పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం చూపించారు. లుక్స్, యాక్షన్‌తో అదరగొట్టారు. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన వైష్ణవ్.. ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలలో నటించినట్లుగా ఈ గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేసింది. తన మొదటి యాక్షన్ ఫిల్మ్‌లో.. వైష్ణవ్ కూడా ఆ భావన కలగకుండా మంచి అభినయాన్ని కనబరిచారు. మొత్తం ఈ టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. (AadiKeshava First Glimpse Talk)

శ్రీకాంత్ ఎన్ రెడ్డి (Srikanth N Reddy) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం సమకూరుస్తున్నారు. గ్లింప్స్‌కి ఆయన అందించిన నేపథ్య సంగీతం హైలెట్ అనేలా ఉంది. టాలీవుడ్ క్రష్ శ్రీలీల ‘చిత్ర’ పాత్రలో నటిస్తుండగా.. వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ నటిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో ఆయన అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నట్లుగా మేకర్స్ తెలుపుతున్నారు. శ్రీకర స్టూడియోస్‌ (Srikara Studios) సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఈ గ్లింప్స్‌లో తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Pic Talk: రారా కృష్ణయ్యా.. రారా కృష్ణయ్యా..

*Ram Charan: ముంబైలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..

*Krithi Shetty: కాబోయేవాడు కాస్త బొద్దుగా ఉండాలి..

*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Updated Date - 2023-05-15T17:33:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!