సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NKR21: మరో యంగ్ దర్శకుడితో.. యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో.. కళ్యాణ్ రామ్ స్పీడ్ చూశారా!

ABN, First Publish Date - 2023-07-05T18:28:30+05:30

నందమూరి కళ్యాణ్ రామ్ యమా స్పీడ్ మీదున్నారు. తాజాగా ఆయన మరో యంగ్ దర్శకుడితో సినిమాకు సైన్ చేశారు. NKR21గా తెరకెక్కనున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం అధికారికంగా ప్రకటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి.. ‘అలా ఎలా’ అనే ఫీల్ గుడ్ రొమ్-కామ్‌ని నిర్మించిన అశోక క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది.

Kalyan Ram 21 Film Announcement
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) మరో యంగ్ దర్శకుడికి ఓకే చెప్పారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండే కళ్యాణ్ రామ్.. వారితో, వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్, యంగ్ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో తన 21వ చిత్రానికి సైన్ చేశారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను (NKR21) బుధవారం అధికారికంగా ప్రకటించారు. కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ (NTR Arts) బ్యానర్‌తో కలిసి.. ‘అలా ఎలా’ అనే ఫీల్ గుడ్ రొమ్-కామ్‌ని నిర్మించిన అశోక క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ (Ashoka Creations) ప్రొడక్షన్ నెం 2 గా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘అలా ఎలా’‌ (Ala Ela)తో అశోక్ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ పెద్ద హిట్ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత హై బడ్జెట్ చిత్రాలను నిర్మించాలనే ఆకాంక్షతో కొంతకాలం వేచి చూశారు. అలాగే నందమూరి కళ్యాణ్‌రామ్‌తో కలసి పని చేయాలనుకుంటున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ (NKR) కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ప్రముఖ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పని చేస్తోందని.. ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాల పరంగా ఇది భారీగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. (NKR21 Announced)

కళ్యాణ్ రామ్ తన పంచ్ పవర్‌ను చూపించే మాస్-అప్పీలింగ్ పోస్టర్ ద్వారా ఈ చిత్రం అవుట్-అండ్-అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ పోస్టర్‌తో సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. కళ్యాణ్ రామ్‌ని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించడానికి ప్రదీప్ చిలుకూరి ఆకట్టుకునే కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ (Kalyan Ram) చేయబోతున్న ప్రాజెక్ట్ ఇదే. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ తెలియజేస్తామన్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Devil Glimpse: గూఢచారి‌కి ఉండాల్సిన ముఖ్యలక్షణం ఏమిటో.. కళ్యాణ్ రామ్ మాటల్లో..!

**************************************

*Sekhar Chandra: ఆ పాటకి 3 కోట్ల వ్యూస్.. ఆనందంలో సంగీత దర్శకుడు

**************************************

*Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

Updated Date - 2023-07-05T18:37:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!