Mission Chapter 1: సంక్రాంతి బరిలోకి లైకా ప్రొడక్షన్స్ చిత్రం

ABN , Publish Date - Dec 25 , 2023 | 12:01 AM

‘2.0, పొన్నియిన్ సెల్వన్’ వంటి సినిమాలను నిర్మించి అందరి మన్ననలు అందుకుని ఇప్పుడు ‘ఇండియన్ 2, రజినీకాంత్ 170’ చిత్రాలతో ఆడియెన్స్‌ని వావ్ అనిపించటానికి సిద్ధమవుతోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఇప్పుడీ సంస్థ నుండి రాబోతున్న మరో డిఫరెంట్ మూవీ ‘మిషన్ చాప్టర్ 1’. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Mission Chapter 1: సంక్రాంతి బరిలోకి లైకా ప్రొడక్షన్స్ చిత్రం
Mission Chapter 1 Still

‘2.0, పొన్నియిన్ సెల్వన్’ వంటి సినిమాలను నిర్మించి అందరి మన్ననలు అందుకుని ఇప్పుడు ‘ఇండియన్ 2, రజినీకాంత్ 170’ చిత్రాలతో ఆడియెన్స్‌ని వావ్ అనిపించటానికి సిద్ధమవుతోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions). భారీ బడ్జెట్ సినిమాలనే కాదు, డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను కూడా పేక్షకులకు అందించటానికి లైకా సంస్థ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ కోవలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ నుంచి రాబోతున్న మరో డిఫరెంట్ మూవీ ‘మిషన్ చాప్టర్ 1’ (Mission Chapter 1).

అరుణ్ విజయ్ (Arun Vijay), ఎమీ జాక్సన్ (Amy Jackson), నిమిషా సజయన్ (Nimisha Sajayan) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అబి హాస‌న్‌, భ‌ర‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌ ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ (Vijay) తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌రించటం గొప్ప విష‌యం. (Mission Chapter 1 Release details)


Mission-Chapter-1.jpg

‘2.0’లో న‌టించి అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ ‘మిషన్ చాప్టర్ 1’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె జైలర్ పాత్రలో మెప్పించబోతున్నారు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన విల‌క్ష‌ణ న‌టి నిమిషా స‌జ‌య‌న్ ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యాన్ని వ‌హిస్తున్నారు. ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Suhasini: ఇప్పుడొస్తున్న సినిమాలపై సుహాసిని హాట్ హాట్ కామెంట్స్

**********************************

*Bonda Mani: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

*******************************

*Salaar: రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్.. రెండో రోజూ కలెక్షన్ల ‘వరదే’!

********************************

*Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?

*********************************

Updated Date - Dec 25 , 2023 | 12:01 AM