కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ala Ninnu Cheri: కోడి బాయె లచ్చమ్మదీ.. పాట వదిలిన తలసాని.. హెబ్బా ఏముందిరా?

ABN, First Publish Date - 2023-09-28T23:11:59+05:30

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కోడి బాయె లచ్చమ్మదీ’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేశారు. మంగ్లీ ఈ పాటను ఆలపించారు.

Hebah Patel in Kodi Bhaye Lachammadi Song

యంగ్ హీరో దినేష్ తేజ్, అందాల తార హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’ (Ala Ninnu Cheri). విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్‌, హీరో బర్త్ డే స్పెషల్ పోస్టర్‌‌లకు మంచి రెస్పాన్స్ రాగా.. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘అలా నిన్ను చేరి’ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మంచి మాస్ బీట్‌ సాంగ్ ‘కోడి బాయె లచ్చమ్మదీ’ (Kodi Bhaye Lachammadi Song)ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

పాటను రిలీజ్ చేసిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. యంగ్ టీం అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారు. యంగ్ టాలెంట్‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. యంగ్ టాలెంట్ టీం తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. కోడిపాయే లచ్చమ్మది అంటూ మంగ్లీ పాడిన ఈ పాట కుర్రకారుని కట్టిపడేసేలా ఉంది. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్‌‌గా నిలవబోతోంది. మంగ్లీ గాత్రం, సుభాష్ ఆనంద్ బాణీలు, భాను కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. ఈ లిరికల్ వీడియోలో హెబ్బా పటేల్, నటన, డ్యాన్స్ అంతా కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీపెద్ద విజయం సాధించాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.


కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘అలా నిన్ను చేరి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయడం విశేషం. చిత్రానికి సుభాష్‌ ఆనంద్ సంగీతం అందించగా.. ఐ ఆండ్రూ కెమెరామెన్‌గా, కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేశారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Agent: ‘ఏజెంట్’ని వదలని కష్టాలు.. ఓటీటీ‌లో విడుదల డౌటే.. ఎందుకంటే?

***************************************

*Pawan Kalyan: జనసేనకు స్టంట్ మేన్ బద్రి విరాళం

*************************************

*Vishal: అదోరకం సనాతన ధర్మం.. విశాల్‌ వ్యాఖ్యలకు నిర్మాత కౌంటర్‌

**********************************

*Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

***********************************

Updated Date - 2023-09-28T23:12:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!