Hebbuli: ‘హెబ్బులి’ దిగేది ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-07-30T18:39:38+05:30 IST

సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ పతాకంపై.. ఎమ్‌. మోహన శివకుమార్‌ సమర్పణలో కిచ్చా సుదీప్, అమలాపాల్‌ జంటగా ఎస్‌. కృష్ణ దర్శకత్వలో సి. సుబ్రహ్మణ్యం నిర్మించిన కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘హెబ్బులి’. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆగస్ట్ 4న నిర్మాత సి. సుబ్రహ్మణ్యం విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. ఈ సినిమా విడుదలకు సిద్ధమైనట్లుగా ఆయన తెలిపారు.

Hebbuli: ‘హెబ్బులి’ దిగేది ఎప్పుడంటే..
Hebbuli Movie Still

సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ పతాకంపై.. ఎమ్‌. మోహన శివకుమార్‌ సమర్పణలో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)‌, అమలాపాల్‌ (Amala Paul) జంటగా ఎస్‌. కృష్ణ (S Krishna) దర్శకత్వలో సి. సుబ్రహ్మణ్యం (C Subramanyam) నిర్మించిన కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘హెబ్బులి’ (Hebbuli). ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూస్‌ని అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ఫుల్ చిత్రంగా పేరు గడించింది. శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ వంటివారు విలన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఆగస్ట్ 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. (Hebbuli Ready to Release)


Hebbuli-1.jpg

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘హెబ్బులి’లో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి 100 కోట్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ. అందుకే ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాము. ముఖ్య నటీనటులతో పాటు శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ వంటి వారి నటన ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఎ. కరుణాకర్ సినిమాటోగ్రఫీ, అర్జున్ జన్య అందించిన మ్యూజిక్ అందరినీ అలరిస్తాయి. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్ 4న గ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న మా ‘హెబ్బులి’ సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. (Hebbuli Movie)


ఇవి కూడా చదవండి:

**************************************

*Brahmanandam: ఇదిగో సీఏం గారూ.. మా అబ్బాయి పెళ్లికి తప్పకుండా రావాలి

**************************************

*Sandeham: హెబ్బా పటేల్ ‘సందేహం’లో ‘చచ్చినా చావని ప్రేమిది’

**************************************

*Allu Aravind: డైరెక్టర్ మారుతి కుమార్తె టాలెంట్‌కి అల్లు అరవింద్ ఫిదా

**************************************

Updated Date - 2023-07-30T18:39:38+05:30 IST