Kalyan Ram: మాటిస్తున్నా.. ‘డెవిల్‌’తో కొడుతున్నాం.. రాసి పెట్టుకోండి

ABN , First Publish Date - 2023-12-12T18:56:27+05:30 IST

వైవిధ్య‌మైన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ నటుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

Kalyan Ram: మాటిస్తున్నా.. ‘డెవిల్‌’తో కొడుతున్నాం.. రాసి పెట్టుకోండి
Devil Movie Trailer Launch Event

వైవిధ్య‌మైన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ నటుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram). ఆయ‌న హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’ (Devil). ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా (Abhishek Nama) దర్శక నిర్మాతగా రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ఆడియెన్స్ థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని ‘బింబిసార’ (Bimbisara) సమయంలో చెప్పాను. దాన్ని మీరు నిజం చేశారు. అదే కోవలో డెఫనెట్‌గా ‘డెవిల్’ మంచి కథ, కథనాలతో మీ ముందుకు వస్తుంది. విజువల్స్ ఎలా ఉంటాయనేది ట్రైలర్‌లో చూశారు. కథను తయారు చేసుకున్న శ్రీకాంత్, అద్భుతమైన విజువల్స్ అందించిన సౌందర్ రాజన్‌గారు, అలాగే వెంకట్ మాస్టర్, రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు, 1940 బ్యాక్ డ్రాప్‌లో చేయాల్సిన ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేసిన గాంధీగారికి థాంక్స్. వీటన్నింటినీ కలిపి ఇలా చూస్తే బావుంటుందని ఆలోచించి ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను గొప్పగా రూపొందించిన అభిషేక్ నామాగారికి థాంక్స్. ఇలా అందరూ వెనకుండి మా ఆర్టిస్టులందరినీ నడిపించారు. సినిమా అనేది ఓ టీమ్ ఎఫర్ట్. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. డిసెంబర్ 29న డెవిల్ మీ ముందుకు వస్తుంది. నా మాట తీసుకోండి.. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త కథతో ‘డెవిల్’ సినిమా ఉంటుంది. ‘బింబిసార 2’ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి మొదలు పెడతాం. డిసెంబర్ 29న డెవిల్ ను చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. (Devil Movie Trailer Launch)


Devil.jpg

చిత్ర దర్శక నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘‘డెవిల్ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమా చేయాలంటే, కథను నమ్మి హీరో ముందుకు రావడం గొప్ప విషయం. రెండేళ్ల పాటు కళ్యాణ్ రామ్‌గారు మరో సినిమా ఏదీ చేయకుండా వర్క్ చేశారు. ట్రైలర్‌లో కళ్యాణ్ రామ్‌గారిని చూసింది తక్కువ. రేపు థియేటర్స్‌లో ఆయన విశ్వరూపాన్ని చూస్తారు. యాక్షన్, పెర్ఫామెన్స్ అదిరిపోతుంది. ఇలాంటి పీరియాడిక్ మూవీ చేయాలంటే మంచి టీమ్ వర్క్ ఉండాలి. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌గారు, శ్రీకాంత్‌గారు, యాక్షన్ మాస్టర్ వెంకట్‌గారు ఇలా అందరూ రెండేళ్లు ఈ మూవీలో పార్ట్ అయ్యారు. ఈ ఏడాది వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) వంటి బ్లాక్ బస్టర్‌తో స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 29న డెవిల్ వంటి బ్లాక్ బస్టర్‌తో కంప్లీట్ అవుతుంది. సంయుక్తా మీనన్, మాళవికకు థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Srikanth Sriram: హారర్ సినిమాల విషయంలో నాకో భయం ఉంది.. అదేంటంటే?

**********************************

*SeshEXShruti: అడివి శేష్‌తో శృతిహాసన్.. ఇది ఎవరూ ఊహించలేదు కదా..

**********************************

*Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!

************************************

Updated Date - 2023-12-12T18:56:29+05:30 IST