Kajal Aggarwal: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి బర్త్‌డే ట్రీట్..

ABN , First Publish Date - 2023-06-19T17:18:53+05:30 IST

నందమూరి నటసింహ బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘భగవంత్ కేసరి’ చిత్రం నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. సోమవారం కాజల్ అగర్వాల్ పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు ట్రీట్‌గా విడుదల చేసిన ఈ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Kajal Aggarwal: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి బర్త్‌డే ట్రీట్..
Kajal Aggarwal in Bhagavanth Kesari

నందమూరి నటసింహ బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇంతకు ముందు బాలయ్య పుట్టినరోజున చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్‌ను వదిలిన మేకర్స్.. ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ క్రష్ శ్రీలీల లుక్‌ని కూడా ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. సోమవారం చందమామ కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. (Kajal Aggarwal Look in Bhagavanth Kesari)

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కాజల్ చీరలో హోమ్లీగా కనిపించారు. సైకాలజీ పుస్తకం చదువుతూ ఫోన్‌లో మాట్లాడుతూ, పెద్ద పెద్ద కళ్ళద్దాలు ధరించి.. నవ్వుతూ ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. ఆమె పాత్రపై క్యూరియాసిటీని కలగజేస్తుంది. ఎందుకంటే.. ఇంతకు ముందు వచ్చిన టీజర్‌లో బాలయ్య వీరోచితంగా కనిపించారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఏమో సైకాలజీ బుక్స్ చదువుతుంది. వీరిద్దకి దర్శకుడు ఎలా కనెక్షన్ ఇచ్చి ఉంటాడా? అనేలా క్యూరియాసిటీ కలుగుతోంది. ప్రస్తుతం కాజల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kajal.jpg

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మాతలు భారీ బడ్జెట్‌తో.. బాలయ్య కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలబడేలా చిత్రీకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాని విజయదశమి (దసరా)కి థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Adipurush Collections: ఆ రెండూ ఊహించినవే కానీ.. ఈ ఏరియాలో మాత్రం ప్రభాస్‌కి కోలుకోలేని దెబ్బే!

**************************************

*Sitara: చిచ్చర పిడుగులా చెలరేగిపోతోన్న మహేష్ తనయ.. సాయిపల్లవిని దించేసింది

**************************************

*Spy: మరో పాన్ ఇండియా సంచలనానికి సిద్ధమైన నిఖిల్.. ఎప్పుడంటే?

**************************************

Updated Date - 2023-06-19T17:18:53+05:30 IST