Sitara: చిచ్చర పిడుగులా చెలరేగిపోతోన్న మహేష్ తనయ.. సాయిపల్లవిని దించేసింది

ABN , First Publish Date - 2023-06-17T20:46:15+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని మరోసారి టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్‌లో ఉండే సితార.. ఈసారి లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి చేసిన ‘సారంగ దరియా’ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సేమ్ టు సేమ్ డ్రస్, డ్యాన్స్ స్టెప్పులతో సాయిపల్లవిని సితార దించేసింది.

Sitara: చిచ్చర పిడుగులా చెలరేగిపోతోన్న మహేష్ తనయ.. సాయిపల్లవిని దించేసింది
Sitara and Sai Pallavi

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) గారాల పట్టి సితార ఘట్టమనేని మరోసారి టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్‌లో ఉండే సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni).. తాజాగా ఓ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తూ.. అందరితో ఔరా అనిపించుకుంటోంది. ఇంతకీ ఆమె ఏ పాటకు డ్యాన్స్ చేసిందని అనుకుంటున్నారా? లేడీ పవర్ స్టార్‌ (Lady Power Star)గా పేరున్న సాయిపల్లవి (Sai Pallavi) పాటకి. డ్యాన్స్‌ పరంగా సాయిపల్లవికి ఎటువంటి క్రేజ్ ఉందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సాయిపల్లవిని ఈ పాటలో సితార దించేసింది.

నాగ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించిన ‘లవ్ స్టోరి’ (Love Story) సినిమాలోని ‘సారంగ దరియా’ (Saranga Dariya) పాట ఎంతగా ఫేమస్ అయిందో.. అందులో సాయి పల్లవి డ్యాన్స్ ఎలా సెన్షేషన్ అయిందో తెలియంది కాదు. అలాంటి పాటకి టేక్ 1 అని ఒక వీడియో, టేక్ 2 అని మరో వీడియోని చేసి.. తన ఇన్‌‌స్టా వేదికగా సితార షేర్ చేసింది. టేక్ 1 అనే వీడియోలో సింగిల్‌గా డ్యాన్స్ చేసిన సితార.. టేక్ 2 వీడియోలో ఇద్దరితో కలిసి గ్రూప్ డ్యాన్స్ చేసింది. ఇక ఆమె చేసిన డ్యాన్స్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ సేమ్ టు సేమ్ సాయిపల్లవిని దించేసిందంటే.. ఏ రేంజ్‌లో సితార ఈ పాటకు డ్యాన్స్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. (Sitara Dance to Saranga Dariya Song)

Situ-Papa.jpg

డ్యాన్స్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే కాదు.. ఆ పాటలో లంగా ఓణి ధరించి సాయిపల్లవి ఎలా అయితే డ్యాన్స్ చేసిందో.. సితార కూడా అలాంటి డ్రస్‌తోనే, అంతే చక్కగా డ్యాన్స్ చేయడం విశేషం (Sitara Dance Video). నిజంగా లంగా ఓణీలో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. సితార వంటి పాపకి మరింత కష్టం. కానీ సాయిపల్లవి ఎలా అయితే అవలీలగా చేసిందో.. సితార కూడా అంతే అవలీలగా చేసేసింది. స్టెప్స్ కూడా పర్ఫెక్ట్‌గా దించేసింది. అందుకే ఈ వీడియో చూసిన వారంతా.. సాయిపల్లవిని మరిపించేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లంగా ఓణిలో.. తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్నావంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా.. ఈ పాటకు డ్యాన్స్ చేసిన తీరుపై సోషల్ మీడియా వేదికగా సితారపై అభినందనల వర్షం కురుస్తోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Spy: మరో పాన్ ఇండియా సంచలనానికి సిద్ధమైన నిఖిల్.. ఎప్పుడంటే?


**************************************

*Adipurush: ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?


**************************************

*Prabhas Fans: సినిమా బాలేదన్నందుకు ఒకర్ని.. హనుమ కుర్చీలో కూర్చున్నందుకు మరొకర్ని.. చితకబాదారు

**************************************

*Lord Hanuma: ‘ఆదిపురుష్’ థియేటర్‌లోకి వానరం.. హనుమంతుడే అంటూ ఆడియన్స్ జైశ్రీరామ్ నినాదాలు.. వీడియో వైరల్


**************************************

Updated Date - 2023-06-17T20:46:15+05:30 IST