కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhimaa: మంగళూరులో ‘భీమా’ యాక్షన్ మొదలైంది

ABN, Publish Date - Dec 24 , 2023 | 07:53 PM

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా.. కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ఆదివారం నుండి మంగళూరులో ప్రారంభమైంది.

Gopichand in Bhimaa

మాచో స్టార్ గోపీచంద్ (Macho Star Gopichand) హీరోగా.. కన్నడ దర్శకుడు ఎ హర్ష (A Harsha) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’ (Bhimaa). సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ఆదివారం నుండి మంగళూరులో ప్రారంభమైంది. గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్‌లో మంగళూరులోని దట్టమైన అడవిలో ఓ సాంగ్‌, యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మరో వైపు ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. (Bhimaa Movie Shooting Update)


మాస్‌, యాక్షన్‌తో కూడిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే అంశాలు పుష్కలంగా ఉండనున్నాయి. హై స్టాండర్డ్ టెక్నికల్, ప్రొడక్షన్ వేల్యూస్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్.. రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్‌ని కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Bonda Mani: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

*******************************

*Salaar: రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్.. రెండో రోజూ కలెక్షన్ల ‘వరదే’!

********************************

*Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?

*********************************

*Ram Charan ISPL: ఐపీఎల్‌లో కాదు ఐఎస్‌పీఎల్‌లో రామ్ చరణ్‌కు టీమ్.. హైదరాబాదే!

*******************************

Updated Date - Dec 24 , 2023 | 07:53 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!