Jilebi: హీరోగా ‘నువ్వు నాకు నచ్చావ్’ దర్శకుడి తనయుడు.. వెంకీ ఎలా సపోర్ట్ చేశారంటే..

ABN , First Publish Date - 2023-04-07T12:55:09+05:30 IST

తనకు ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు విజయభాస్కర్ తనయుడి అరంగేట్ర చిత్రానికి విక్టరీ వెంకటేష్ సపోర్ట్ అందించారు.

Jilebi: హీరోగా ‘నువ్వు నాకు నచ్చావ్’ దర్శకుడి తనయుడు.. వెంకీ ఎలా సపోర్ట్ చేశారంటే..
Jilebi First Look Teaser Launch

‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav), ‘నువ్వే కావాలి’ (Nuvve Kavali), ‘మన్మథుడు’ (Manmadhudu) వంటి సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ (K Vijaya Bhaskar) దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ‘జిలేబి’ (Jilebi) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంజు అశ్రాని సమర్పణలో ఎస్ఆర్కే బ్యానర్‌పై.. బిజినెస్‌మ్యాన్ గుంటూరు రామకృష్ణ (Guntur Ramakrishna) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడు విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు (Director Vijay Bhaskar Son) శ్రీకమల్ (Sri Kamal) హీరోగా పరిచయం అవుతుండగా.. శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌ని విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) విడుదల చేశారు. తనకు ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు విజయభాస్కర్ తనయుడి చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌ని విడుదల చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెంకీ అన్నారు.

Read Also-Manchu Manoj: సెగ గడ్డ వచ్చింది... గోకుతారా కొంచెం... మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది నిజంగా స్వీట్ అకేషన్. సినిమా కూడా ‘జిలేబి’లా స్వీట్‌గా ఉంటుందని నమ్ముతున్నాను. విజ‌య‌భాస్కర్‌గారు నాకు ఇష్టమైన డైరెక్టర్. నా ఫేవరేట్ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి’ చిత్రాలు ఆయన ఎంత చక్కగా తీశారో అందరికీ తెలుసు. ‘జిలేబి’ తప్పకుండా ఒక ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్ అవుతుందని నమ్ముతున్నా. నటుడిగా పరిచయం అవుతున్న కమల్‌కి ఆల్ ది బెస్ట్. శివాని, కమల్ ఇద్దరూ మంచి పాత్రలతో అలరిస్తారనే నమ్మకం వుంది. నిర్మాతలు రామకృష్ణ, అంజులకు ఆల్ ది బెస్ట్. ఇది అందరూ చూసే సినిమా అవుతుంది. ఈ సినిమా విజయభాస్కర్‌గారికి మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. (Jilebi Movie First Look Teaser)

దర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేసిన వెంకటేష్‌గారికి కృతజ్ఞతలు. ఆయన చేతుల మీదగా మా అబ్బాయి లాంచ్ అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా విషయానికి వస్తే.. రామకృష్ణ, అంజు‌గార్లతో ఇది నా మొదటి కొలాబరేషన్. షూటింగ్ ఎలా స్టార్ట్ అయ్యిందో.. ఎలా ఫినిష్ అయ్యిందో తెలియకుండానే అయిపోయింది. ఇది బ్యూటీఫుల్ జర్నీ. టీం అంతా ఎంతో సపోర్ట్‌గా వున్నారు. అందుకే ఇంత ఫాస్ట్‌గా పూర్తి చేయగలిగాం. మణిశర్మ‌ (Mani Sharma)గారు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. సతీష్ చాలా చక్కని విజువల్స్ ఇచ్చారు. అంతా ఒక కుటుంబంలా కలసి ఈ సినిమా చేశాం. సినిమా ఎలా వుందో చూసి.. ఇక ప్రేక్షకులే చెప్పాలని అన్నారు. (Director Vijay Bhaskar about Jilebi)

ఇవి కూడా చదవండి:

*********************************

*Ravanasura Twitter Review: రవితేజ ‘రావణాసుర’ ట్విట్టర్ టాక్ ఏంటంటే..

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

*Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..

Updated Date - 2023-04-07T12:55:41+05:30 IST