సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MS Dhoni: ఐపీఎల్ ట్రోఫీ తర్వాత.. ‘LGM’‌తో ప్రేక్షకుల ముందుకు!

ABN, First Publish Date - 2023-06-16T22:48:06+05:30

ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి మరోసారి వార్తలలో హైలెట్ అవుతున్నారు. అందుకు కారణం ఆయన నిర్మాతగా మారి తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసేందుకు సిద్ధమవడమే. ఆల్రెడీ ఆయన నిర్మించిన LGM అనే చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్ర ట్రైలర్, ఆడియో వేడుకకు తన భార్య సాక్షితో కలిసి ధోని అటెండ్ కానున్నారని తెలుస్తోంది.

Sakshi Dhoni and MS Dhoni
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండియ‌న్ క్రికెట్ హిస్టరీలో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎవరయ్యా అంటే.. వెంటనే వినిపించే పేరు మ‌హేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni). రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్‌లో ట్రోఫీ గెలుచుకుని తనలో సత్తాని మరోసారి చాటిన ధోని.. ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోనూ తన తడాఖా చూపేందుకు సిద్ధమవుతున్నారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ (Dhoni Entertainment) బ్యాన‌ర్‌ స్థాపించి ‘LGM’ (Let's Get Married) అనే సినిమాను ఆయన నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం బయటికి వచ్చినా.. ఐపీఎల్ (IPL) తర్వాత ధోని పేరు ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడీ సినిమా విషయంలో మరోసారి ధోని హైలెట్ అవుతున్నారు. త‌మిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి (Ramesh Thamilmani) ద‌ర్శ‌క‌త్వంలో ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ధోని భార్య సాక్షి ధోని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జరుపుకుంటోంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను, ఆడియోను విడుదల చేయ‌టానికి మేక‌ర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకలకు మ‌హేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని (Sakshi Dhoni) కూడా పాల్గొన‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ.. కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్ష‌కుల గుండెల‌ను తాకుతుంది. LGM చిత్రానికి ప్రేక్ష‌కులు త‌మ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను అందిస్తార‌ని భావిస్తున్నామని అన్నారు. కాగా.. ఇటీవ‌ల విడుదలైన LGM టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేసింది. డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో 7 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను ఆ టీజర్ సాధించింది. దర్శకుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణినే ఈ సినిమాకు మ్యూజిక్‌ను కూడా అందిస్తున్నారు. హరీష్ కల్యాణ్ (Harish Kalyan), ఇవానా (Ivana), నదియా (Nadhiya), యోగి బాబు, మిర్చి విజ‌య్ త‌దిత‌రులు నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Prabhas Fans: సినిమా బాలేదన్నందుకు ఒకర్ని.. హనుమ కుర్చీలో కూర్చున్నందుకు మరొకర్ని.. చితకబాదారు

**************************************

*Lord Hanuma: ‘ఆదిపురుష్’ థియేటర్‌లోకి వానరం.. హనుమంతుడే అంటూ ఆడియన్స్ జైశ్రీరామ్ నినాదాలు.. వీడియో వైరల్


**************************************

*Adipurush: ‘ఆదిపురుష్’ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

**************************************

*King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను


**************************************

*Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..


**************************************

*Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!

**************************************

Updated Date - 2023-06-16T23:11:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!