Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..

ABN , First Publish Date - 2023-06-15T19:06:27+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్‌ల కాంబినేషన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ‘ఓజీ’ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు. ఈ సినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా పేరున్న ఇమ్రాన్ హహ్మి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా అధికారికంగా తెలియజేస్తూ.. ఆయన లుక్‌ని కూడా రివీల్ చేశారు. దీంతో ఓజీ మరోసారి ట్రెండ్ అవుతోంది.

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..
Emraan Hasmi and Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సుజీత్‌ (Sujeeth)ల కాంబినేషన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) నిర్మిస్తోన్న ‘ఓజీ’ (OG) సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి.. ఏదో ఒక అప్‌డేట్ మేకర్స్ వదులతూనే ఉన్నారు. మాములుగా ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి హీరోల లుక్ లీక్ కాకుండా దర్శకనిర్మాతలు జాగ్రత్తపడుతున్నారు. కానీ ‘ఓజీ’ విషయంలో నిర్మాతే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) షూటింగ్ స్పాట్‌కి వస్తే చాలు.. ఫొటోల మీద ఫొటోలు వదిలేస్తూ.. ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తున్నారు. ఇక వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుష్ చేస్తున్న డీవీవీ సంస్థ.. తాజాగా ‘ఓజీ’లో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హహ్మి (Emraan Hashmi) ఓ కీలక పాత్ర చేస్తున్నట్లుగా తెలుపుతూ.. ఆయన లుక్‌ని కూడా విడుదల చేసింది. దీంతో మరోసారి ‘ఓజీ’ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఇమ్రాన్ హష్మి బాలీవుడ్‌ (Bollywood)లో ఎటువంటి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు విలన్‌గా ఆయన టాలీవుడ్‌‌కి పరిచయం కాబోతున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్స్ చాలా మంది సౌత్ సినిమాలలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలా ఇప్పుడు ఇమ్రాన్ హహ్మి కూడా సౌత్ వైపు అడుగులు వేస్తున్నారు. ‘యుద్ధం మొదలు పెట్టడానికి వస్తున్నా. OGలో నేను కూడా భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్‌, సుజీత్‌లతో కలిసి వర్క్ చేసేందుకు ఎంతగానో వేచి చూస్తున్నాను. దానయ్యగారు ధన్యవాదాలు’ అని ఇమ్రాన్ హష్మి ఓజీ అవకాశంపై రియాక్ట్ అయ్యారు. ఇక ‘ఓజీ’ విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమాలో ‘అర్జున్ దాస్’ (Arjun Das), ‘శ్రియా రెడ్డి’ (Sriya Reddy) వంటి వారు ఎంటరైనట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఇమ్రాన్ హహ్మి కూడా చేరడంతో.. మొత్తానికి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే భావనని అటు ఫ్యాన్స్‌లోనూ, ఇటు నెటిజన్లలోనూ మేకర్స్ కలిగిస్తున్నారు.

Emraan.jpg

అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగైదు సినిమాలు చేస్తున్నా.. షూటింగ్ పరంగా మాత్రం ‘ఓజీ’ (#OG) సినిమాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. అందుకే దర్శకుడు సుజీత్ కూడా స్పీడ్‌స్పీడ్‌గా సినిమాని చిత్రీకరించే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉన్న తరుణంలో.. ఆయన లేని సన్నివేశాలను మేకర్స్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు అంతరాయం కలగకుండా.. ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలంతా ఇప్పుడో డెసిషన్‌కి వచ్చినట్లుగా తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ, గుంటూరులోనే పవన్ కళ్యాణ్ సీన్స్ చిత్రీకరించాలని వాళ్లు ప్లాన్ చేశారు. దీంతో ఇక సినిమాల పరంగానే కాకుండా పొలిటికల్‌గానూ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండనున్నారు. కాగా.. ‘పంజా’ (Panjaa) తరహాలో ‘ఓజీ’ చిత్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!


**************************************

*SJ Suryah: అమితాబ్ బచ్చన్‌ హీరోగా సినిమా ప్లాన్ చేశాను కానీ..


**************************************

*Urvashi: విలేకరులారా.. తప్పకుండా ఆ ప్రశ్న అడగండి


**************************************

*Adipurush: ఏపీ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది కానీ..

**************************************

Updated Date - 2023-06-15T19:27:43+05:30 IST