Currency Nagar: మనీ నేపథ్యంలో మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-12-14T18:54:25+05:30 IST

డబ్బుతో ముడిపడి ఉన్న నాలుగు విభిన్న కథాంశాలతో రూపుదిద్దుకున్న చిత్రం ‘కరెన్సీ నగర్’. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లలోకి రానుంది

Currency Nagar: మనీ నేపథ్యంలో మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
Currency Nagar Movie Still

డబ్బుతో ముడిపడి ఉన్న నాలుగు విభిన్న కథాంశాలతో రూపుదిద్దుకున్న చిత్రం ‘కరెన్సీ నగర్’ (Currency Nagar). ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో వెన్నెల కుమార్ పోతేపల్లి (Vennela Kumar Pothepalli) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 29న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


Currency.jpg

ఆంథాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుందని, మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్మాతలు తెలిపారు. డబ్బు చుట్టూ తిరిగే కథగా ఈ ‘కరెన్సీ నగర్’ సినిమా నేపథ్యం ఉంటుందని.. డబ్బుకు, మనిషికి ఉన్న సంబంధాన్ని దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడని, ఈ పాయింట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, సినిమా కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు. (Currency Nagar Ready to Release)


ఇవి కూడా చదవండి:

====================

*Gudumba Shankar: జనసేన పార్టీకి ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ఆదాయం

************************************

*Kushee Ravi: ఐకాన్ స్టార్, న్యాచురల్ స్టార్ అంటే ఇష్టం..

**********************************

*Salaar: ‘సూరీడే..’ పాట.. ‘సలార్’ స్ట్రెంత్ ఇది

*************************************

*Mass Combo: మ్యాజికల్ మాస్ కాంబో ఈజ్ బ్యాక్.. కాకపోతే ఇవే డౌట్స్!

*****************************************

Updated Date - 2023-12-14T18:54:26+05:30 IST