Animal: ‘యానిమల్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ బాలీవుడ్ నటులు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-11-28T19:57:31+05:30 IST

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమాని అందరూ చూడాలని అనిల్ కపూర్, బాబీ డియోల్ కోరారు.

Animal: ‘యానిమల్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ బాలీవుడ్ నటులు ఏమన్నారంటే..
Animal Pre Release Event

రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఎలాంటి క్రేజ్‌ని తీసుకొచ్చిందో తెలియంది కాదు. ర‌ణ్‌బీర్ క‌పూర్ సరసన నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా జంటగా నటించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. (Animal Pre Release Event)

ఈ కార్యక్రమంలో అనిల్ కపూర్ (Anil Kapoor) మాట్లాడుతూ.. ఒక నటుడిగా నాకు జన్మనిచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ. నామొదటి సినిమా ‘వంశవృక్షం’.. ది గ్రేట్ బాపు గారి దర్శకత్వంలో చేశాను. మళ్ళీ ఇప్పుడు ‘యానిమల్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తున్నా. ఇది నాకు స్పెషల్ ఫీలింగ్. సందీప్ వంగా క్రేజీ, బ్రిలియంట్ దర్శకుడు. భూషణ్ గారు చిన్న వయసులోనే టీ-సిరిస్ సామ్రాజ్యాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’లో ఏం చేశారో తెరపై చూడాల్సిందే. రష్మిక అదృష్టం ఈ చిత్రానికి కావాలి. దాదాపు 43ఏళ్ల తర్వాత నేను చేసిన తెలుగు సినిమా ఇది. ఈ సినిమా బాబీ డియోల్ జీవితాన్ని మారుస్తుంది. మహేష్ బాబుగారితో ఎప్పటినుంచో మంచి అనుబంధం వుంది. మేమంతా ఒక ఫ్యామిలీలా వుంటాం. గ్లోబల్ సూపర్ డూపర్ డైరెక్టర్ రాజమౌళి‌గారు మనందరినీ గర్వపడేలా చేశారు. వారు ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. డిసెంబర్ 1న ‘యానిమల్’ తప్పకుండా అందరినీ అలరిస్తుందని అన్నారు.


animal.jpg

బాబీ డియోల్ (Bobby Deol) మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అనందంగా వుంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. దర్శకుడు సందీప్ వంగా, టీసిరిస్‌కు ధన్యవాదాలు. మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli)‌గారు ఈ వేడుకలో వుండటం ఆనందంగా వుంది. మహేష్ బాబు‌ మొదటి సినిమా ముహూర్తానికి నేను హజరయ్యాను. అప్పుడు వారి స్టూడియోలోనే ఓ సినిమా చేస్తున్నా. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ‘యానిమల్’ని డిసెంబర్ 1న అందరూ చూడాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

====================

*విలన్‌గా నటించాలనే కోరిక నెరవేరింది: యంగ్ హీరో

*************************************

*Shashtipoorthi: ‘లేడీస్ టైలర్’ జంట ‘షష్టిపూర్తి’ ఎంత వరకు వచ్చిందంటే..

***********************************

*Rashmika Mandanna: గర్ల్ ఫ్రెండ్‌గా రష్మిక మందన్నా.. క్లాప్ కొట్టేశారు

**********************************

Updated Date - 2023-11-28T19:57:32+05:30 IST